కెరియర్‌‌‌‌‌ను పర్ఫెక్ట్‌‌‌‌గా ప్లాన్ చేసుకుంటున్న కుర్రహీరో.. హీరోగా రాణిస్తూనే.. విలన్‌‌‌గానూ

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన హీరో కార్తికేయ. ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికి మొదటి సినిమాను మించిన హిట్ అందుకోలేక పోయాడు.

కెరియర్‌‌‌‌‌ను పర్ఫెక్ట్‌‌‌‌గా ప్లాన్ చేసుకుంటున్న కుర్రహీరో.. హీరోగా రాణిస్తూనే.. విలన్‌‌‌గానూ

Updated on: Dec 18, 2020 | 5:22 PM

‘ఆర్ఎక్స్ 100’సినిమాతో సంచలనం సృష్టించిన హీరో కార్తికేయ. ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికి మొదటి సినిమాను మించిన హిట్ అందుకోలేక పోయాడు. ఆతర్వాత విలన్ గా మరి నాని నటించిన’గ్యాంగ్ లీడర్’సినిమా చేసాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్న కార్తికేయ ఆతర్వాత విలన్ గా కంటిన్యూ అవుతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ హీరోగా  సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో’చావు కబురు చల్లగా’అనే సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమాలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఆమధ్య విడుదలయ్యింది. డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.ఈ మూవీని  ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఇంకా టైటిల్ కన్ఫామ్ కానీ ఓ సినిమాలోనూ కార్తికేయ నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు తమిళ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న సినిమాలో కార్తికేయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అజిత్ హీరోగా నటిస్తున్న ‘వలిమై’ సినిమాలోకార్తికేయ విలన్ గా కనిపించనున్నాడట. ఇలా  హీరోగా నటిస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్నసినిమాల్లో ప్రతినాయకుడిగాను కనిపిస్తూ కెరియర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ కుర్రహీరో.