తన డెడికేషన్‌తో అభిమానులను షాక్‌కి గురి చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్.. ఏకంగా 98 కిలోల బరువు తగ్గిన గణేశ్ ఆచార్య.
కొరియోగ్రఫీలోనే కాదు ఫిట్‌నెస్‌లోనూ తనకు ఎవరూ సాటిలేరని నిరూపించారు గణేశ్. సుమారు 200 కిలోలున్న గణేశ్ తాజాగా ఏకంగా 98 కిలోలు తగ్గి అభిమానులను షాక్‌కి గురిచేశారు.
Ganesh acharya shocking loss weight: గణేశ్ ఆచార్య.. ఈ పేరు బాలీవుడ్‌కి సుపరిచతం. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఏబీసీడీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు గణేశ్. ఈయన బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ అనే విషయం తెలిసిందే. భారీ శరీరంతో ఉన్నా హీరోలతో మాత్రం రకరకాల స్టెప్పులు వేయించడం ఈయన సొంతం. కొరియోగ్రఫీలోనే కాదు ఫిట్‌నెస్‌లోనూ తనకు ఎవరూ సాటిలేరని నిరూపించారు గణేశ్. సుమారు 200 కిలోల బరువున్న గణేశ్ తాజాగా ఏకంగా 98 కిలోలు తగ్గి అభిమానులను షాక్‌కి గురిచేశారు. పూర్తిగా సన్నగా మారిన గణేశ్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
View this post on Instagram
తాజాగా గణేశ్ ‘కపిల్ శర్మ షో’కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను ఇంతలా బరువు తగ్గడం వెనకాల ఉన్న సీక్రెట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఏడాదిన్నర కాలంలో 98 కిలోలు తగ్గినట్లు గణేశ్ తెలిపారు. అయితే ఇది అంత సులభంగా జరిగింది కాదని.. ఈ సమయంలో ఒక్క రోజు కూడా జిమ్ మానకుండా, కఠిన కసరత్తులు చేశానని చెప్పుకొచ్చారు. బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకున్న గణేశ్ ఇప్పుడు తన ఫిట్‌నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.