షూటింగ్ స్పాట్ ఫన్నీ వీడియోను షేర్ చేసిన రష్మిక.. వివాదాన్ని ముందుగానే ఊహించి క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ.
నిత్యం సినిమాలతో బిజీగా ఉండే రష్మిక మందన్న సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే రష్మిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది.
Rashmika shares funny video: ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార రష్మిక మందన్న. కన్నడ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన క్యూట్ లుక్స్, నటనతో తెలుగు కుర్రకారు మతి పోగొట్టిన ఈ అందాల తార ‘గీత గోవిందం’ సినిమాతో ఒక్కసారిగా బడా హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం బడా హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ దూసుకెళుతోందీ చిన్నది. ఇదిలా ఉంటే నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే రష్మిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది.
View this post on Instagram
‘ఛలో’ చిత్రానికి సంబంధించిన ఓ వర్కింగ్ వీడియోను పోస్ట్ చేసిన రష్మిక.. ‘ఈ వీడియో ఎవరికైనా గుర్తుందా’? అని క్యాప్షన్ జోడించింది. ఈ వీడియోలో రష్మిక దేవత గెటప్‌లో తుంబురను తిప్పుతూ ఉంది. అయితే ఎక్కడ వీడియో కాంట్రవర్సీలకు దారి తీస్తుందో అని భావించిన ఈ ముద్దుగుమ్మ మరో క్యాప్షన్‌ను కూడా రాసుకొచ్చింది. ఇంతకీ ఆ క్యాప్షన్ ఏంటంటే.. ‘నేను ఏ సాంప్రదాయాన్నీ, దేవతలను అగౌరవపరచడం లేదు. ఈ వీడియోను దయచేసి ఆ కోణంలో చూడకండి. ఇది ఓ సినిమాలోని ఫన్నీ సీన్` అని పేర్కొంది. ఇలా రష్మిక ముందుగానే జాగ్రత్త పడిందన్నమాట.