సీనయ్య విలన్‌గా యంగ్ హీరో.. అతడెవరంటే.?

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ‘సీనయ్య’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నరసింహారావు అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. మెకానిక్ పాత్రలో వినాయక్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. అటు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు ఫ్యాన్స్‌ను విశేష స్పందన లభించింది. ఇక ఇందులో విలన్‌గా ఎవరు కనిపిస్తారనే దానిపై తాజాగా అప్డేట్ వచ్చింది. ‘అందాల రాక్షసి’ […]

సీనయ్య విలన్‌గా యంగ్ హీరో.. అతడెవరంటే.?
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 04, 2019 | 3:58 AM

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ‘సీనయ్య’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నరసింహారావు అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

మెకానిక్ పాత్రలో వినాయక్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. అటు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు ఫ్యాన్స్‌ను విశేష స్పందన లభించింది. ఇక ఇందులో విలన్‌గా ఎవరు కనిపిస్తారనే దానిపై తాజాగా అప్డేట్ వచ్చింది. ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు. ఇంతకుముందు నవీన్ ‘నేను లోకల్’, ‘అరవింద సమేత’ వంటి పలు చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమాలో నవీన్.. వినాయక్‌తో పోటీ పడి మరీ తన విలనిజంను చూపించనున్నాడు.