KGF 2: కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఖరారు.. సినిమా విడుదల తేదీపై మరోసారి క్లారిటీ..

KGF Chapter 2: కన్నడ సూపర్‌ స్టార్‌ యష్‌ (Yash) హీరోగా, ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ (KGF) చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

KGF 2: కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఖరారు.. సినిమా విడుదల తేదీపై మరోసారి క్లారిటీ..
Kgf
Follow us
Basha Shek

|

Updated on: Mar 03, 2022 | 12:24 PM

KGF Chapter 2: కన్నడ సూపర్‌ స్టార్‌ యష్‌ (Yash) హీరోగా, ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ (KGF) చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోల్డ్‌ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన పాన్‌ ఇండియా సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యష్‌. ఇక కేజీఎఫ్‌ రిలీజ్‌ సమయంలోనే సీక్వెల్‌ కూడా ఉంటుందని దర్శక నిర్మాతలు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మొదటి భాగం కంటే మరిన్ని అదనపు హంగులతో రెండో పార్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. సునీల్‌ దత్, రవీనా టాండన్‌ లాంటి ప్రముఖ నటులు కేజీఎఫ్‌2 లో నటించనున్నారు. వీటికి సంబంధించిన లుక్స్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. దీంతో కేజీఎఫ్‌ సీక్వెల్‌ కోసం ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్స్‌లో చూద్దామా అని ఆసక్తితో ఉన్నారు. అయితే కరోనా కారణంగా ఈ పాన్‌ ఇండియా సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

కాగా కొన్ని రోజుల క్రితం ఏప్రిల్‌ 14న కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి ధ్రువీకరించింది చిత్రబృందం. దీంతో పాటు ట్రైలర్‌ విడుదలకు కూడా ముహూర్తం ఫిక్స్‌ చేసింది. మార్చి 27 వ తేదీన సాయంత్రం 6.47 గంటలకు కేజీఎఫ్‌ 2 సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. తాజా అప్డేట్‌త హీరో యశ్‌ ఫ్యాన్స్‌ లో ఉత్సాహం మొదలైంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఓ స్పెషల్‌ సాంగ్‌ లో నర్తించనుంది.

Also Read:Poland Ukraine Border: యుద్ధానికి దగ్గరగా కేంద్ర మంత్రులు.. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద.. భారతీయుల తరలింపులో పాలుపంచుకుంటున్న..

AHA OTT: బాల్య వివాహాలపై ఆహా సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘ఖుబూల్‌ హై’.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌ కానుందంటే..

Bheemla Nayak: బాక్సాఫీస్‌ దుమ్ము దులుపుతోన్న భీమ్లానాయక్‌.. ఆరు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్