Nayanthara: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. స్పెయిన్ లో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించారు ఇద్దరు ఇండియన్స్ ఇంతకీ వీరెవరనుకుంటున్నారా.. రీడ్ దిస్ స్టోరీ.. సౌతిండియా సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త విగ్నష్ తో కలిసి స్పెయిన్ లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. జూన్ లో చెన్నైలో వివాహం చేసుకున్న ఈజంట బార్సిలోనాలో విహారయాత్రలో ఉన్నారు.
టూర్ లో ఎంజాయ్ చేస్తూనే స్పెయిన్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ.. తమ దేశభక్తిని చాటుకున్నారు ఈజంట. సోమవారం (ఆగస్ట్ 15)వ తేదీన దేశమంతా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోగా.. స్పెయిన్ టూర్‌లో ఉన్న ఈ జంట మాత్రం అక్కడ త్రివర్ణ పతాకంతో సందడి చేసింది. బార్సిలోనా వీధుల్లో నయన్, విగ్నేష్ భారత త్రివర్ణ పతకాన్ని చెరో వైపూ పట్టుకొని తిరిగారు.
సోమవారమంతా వీళ్లు ఎటు వెళ్లినా చేతిలో జాతీయ జెండా పట్టుకుని కనిపించారు. ఇలా స్పెయిన్ లోనూ భారత గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేశారు నయనతార, విఘ్నేష్ జంట. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నూతన జంట దేశభక్తిని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హర్ ఘర్ తిరంగా పేరుతో భారత్ లోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడిన వేళ.. ఎక్కడో ఉన్న స్పెయిన్‌లో నయన్, విగ్నేష్ భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ప్రదర్శించారు. ఈవీడియోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. స్లో-మోషన్ వీడియోలో విఘ్నేష్, నయనతార రద్దీగా ఉండే వీధులు, పర్యాటక ప్రదేశాలలో జనం మధ్య నడుచుకుంటూ జెండాను పట్టుకుని కలిసి ఫోటోలు దిగారు. నయనతార ఒక జత బ్లూ డెనిమ్స్, తెలుపు స్నీకర్లతో తెల్లటి చొక్కా ధరించగా, విఘ్నేష్ తెల్లటి టీ-షర్టు, ప్యాంటు పసుపు చొక్కాతో కనిపించింది. అతను నియాన్ గ్రీన్ స్నీకర్స్ కూడా ధరించాడు. అలాగే వీరిద్దరి రొమాంటిక్ ఫోటోను కూడా ఇన్ స్టాలో షేర్ చేశాడు. నయనతార బార్సిలోనాలోని గోతిక్ కేథడ్రల్ ముందు పోజులిస్తుండగా.. ఆమె నుదిటిపై ముద్దు పెట్టాడు భర్త విఘ్నేష్.. మొత్తం మీద స్పెయిన్ లో దేశభక్తిని చాటుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.