OTT Movie: చచ్చినోడు రోజుకో హత్య చేస్తే? ఓటీటీలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ గ్యారెంటీ

ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. సరికొత్త కథా కథనాలు, ఉత్కంఠభరిత సీన్లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్దిరిపోయే ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కింది.

OTT Movie: చచ్చినోడు రోజుకో హత్య చేస్తే? ఓటీటీలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ గ్యారెంటీ
Aaryan Movie

Updated on: Nov 27, 2025 | 7:03 PM

ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను ఆదరిస్తున్నారు ఆడియెన్స్. మరీ ముఖ్యంగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వచ్చే క్రైమ్ థ్రిల్లర సినిమాలకు ఓటీటీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అలా రీసెంట్ గా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా థియేటర్లలో విడుదలైంది. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. చచ్చిపోయినా కూడా ఒక మనిషి ఎంత డేంజర్ అవుతాడో ఈ సినిమాలో చూపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, ఉత్కంఠభరితమైన సీన్లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. ఈ సినిమా కథ మొత్తం అత్రేయ అనే ఒక రైటర్ చుట్టూ తిరుగుతంది. అతను ఒక లైవ్ టీవీ షోలో నేను ఈ దేశంలో ఎవరూ ఆపలేని ఒక పర్ఫెక్ట్ క్రైమ్ చేస్తానంటూ సవాల్ విసురుతాడు. 5 రోజుల్లో 5 మందిని చంపేస్తా అని చెప్పి అక్కడే తన గొంతు కోసేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు.

రైటర్ స్టేట్మెంట్ విని చాలామంది షాక్ అవుతారు. కొందరు పిచ్చివాగుడని లైట్ తీసుకుంటారు. కట్ చేస్తే.. మరుసటి రోజు ఉదయమే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇంట్లోనే హత్యకు గురవుతాడు. ఆ మరుసటి రోజు ఒక బిజినెస్ మ్యాన్ చనిపోతాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ డైలీ మర్డర్స్ ఆపడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. కానీ హత్యలు మాత్రం ఆగవు. ఆత్రేయ డైరీలో ఉన్న ఒక్కొక్కరు చనిపోతూనే ఉంటారు. మరి చనిపోయిన వ్యక్తి ఎలా ఈ హత్యల చేశాడు? అసలు ఆత్రేయ ప్లాన్ ఏమిటి? ఎందుకీ వారిపై కక్షగట్టాడు? పోలీసులు ఈ సీరియల్ మర్డర్స్ ను ఎలా ఆపారు? చివరికి ఏమైంది? అన్న విషయాలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

సినిమా ప్రారంభమైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్ అందించే ఈ సినిమా పేర ఆర్యన్. విష్ణు విశాల్ హీరోగా నటించాడు. సెల్వ రాఘవన్ విలన్‌గా నటించాడు. వణి భోజన్, వాణీ కపూర్, జీవా సుబ్రహ్మణ్యన్, చంద్రు కీలక పాత్రలు పోషించారు.ఇప్పుడీ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. ఇవాళ్టి అర్ధ రాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఆర్యన్ సినిమా స్ట్రీమింగ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి