సార్డీనియా, అక్టోబర్ 4: బాలీవుడ్ నటి గాయత్రీ జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తు్న్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇటలీ ట్రిప్‌లో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నటి గాయత్రి, ఆమె భర్త ప్రయాణిస్తున్న లగ్జరీ కారు అదే రోడ్డుపై వస్తున్న ఫెరారీ క్యాంపర్ వ్యాన్‌ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఫెరారీ కారులో ఉన్న స్విస్ జంట అక్కడికక్కడే మృతి చెందారు. ఇక గాయత్రి, ఆమె భర్త తీవ్రగా గాయపడగా.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. అసలేం జరిగిందంటే..
విహారయాత్ర నిమిత్తం గాయత్రీ ఆమె భర్తతో కలిసి ఇటీవల ఇటలీలోని సార్డీనియాకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న లగ్జరీ కార్ల పరేడ్‌లో వీరు కూడా పాల్గొన్నారు. పరేడ్‌లో భాగంగా టెయిలాడా నుంచి ఓల్బీయాకు వరకు వెళ్లవల్సి ఉంది. ఈ పరేడ్‌కు వెళుతున్న క్రమంలో గాయత్రీ, ఆమె భర్త ప్రయాణిస్తున్న లంబోర్గిని కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఫెరారీ కారు, వ్యాన్‌ను బలంగా ఢీ కొట్టింది. రెండు కారులు తమ ముందున్న భారీ క్యాంపర్ వ్యాన్‌ను ఓవర్ టేక్ చేసేందుకు యత్నిస్తున్న క్రమంలో అవి రెండూ ఢీ కొట్టుకున్నాయి. కార్ల ముందున్న వ్యాన్ కూడా బోల్తా పడింది. ఫెరారీ కారులో మంటలు చెలరేగడంతో స్విట్జర్లాండ్‌కు చెందిన మెలిస్సా క్రౌట్లీ (63), మార్కస్ క్రౌట్లీ (67) దంపతులు మృతి చెందారు. నటి గాయత్రీ ఆమె భర్త ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో దృశ్యాలు వెనుక వస్తున్న మరో కారు డాష్ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T
— Globe Clips (@globeclip) October 3, 2023
గాయత్రీ జోషి బాలీవుడ్ నటి, వీడియో జాకీ, మోడల్. ఛానల్ వీ ఇండియాలో వీడియో జాకీగా గాయత్రి తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించింది. ఆమె 2004 చిత్రం ‘స్వదేస్’ అనే హిందీ మువీలో నటించింది. ఈ మువీలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. ఆ తర్వాత 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. జగ్జీత్ సింగ్ ‘కాఘజ్ కి కష్టి’, హన్స్ రాజ్ హన్స్ ‘ఝంజారియా’ మ్యూజిక్ వీడియోలలో కూడా నటి గాయత్రీ జోషి నటించారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.