OTT Movie: మెల్ల కన్ను యువకుడి లవ్‌స్టోరి.. అప్పుడే ఓటీటీలోకి తెలుగు ఎమోషనల్ లవ్ స్టోరీ.. అధికారిక ప్రకటన
ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెల్లకన్ను ను కళ్ల జోడుతో కవర్ చేస్తూ అభద్రతా భావంతో బతికే హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఐఎమ్ డీబీలో ఈ మూవీకి ఏకంగా 8.5 రేటింగ్ దక్కడం విశేషం.

ఈ మధ్యన మలయాళం సినిమాలు హిట్ అవ్వడానికి ప్రధాన కారణం న్యాచురాలిటీ . కథ సింపుల్ గా ఉన్నా దానిని వైవిధ్యంగా తెరకెక్కించడ మలయాళం మేకర్స్ ప్రత్యేకత. అందుకే మాలీవుడ్ సినిమాలు థియేటర్లలో కోట్లాది రూపాయల కలెక్షన్లు తెస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అప్పుడప్పుడు తెలుగులోనూ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి. మెల్లకన్ను ఉన్న ఓ యువకుడి జీవితం ఆధారంగా ఇటీవలే ఒక తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత వారమే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కథ, కథనాల పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ అందరూ చిన్న నటులే ఉండడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అందుకే రెండు వారాల గ్యాప్ లోనే ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరోకు మెల్ల కన్ను ఉండడంతో చిన్నప్పట్నుంచే ఆత్మన్యూనతతో బాధపడుతుంటాడు. తన లోపాన్ని కవర్ చేసేందుకు నళ్లటి కళ్లద్దాలు ధరించడం అలవాటు చేసుకుంటాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసి తండ్రి చేసిన అప్పులను తీరుస్తుంటాడు. అదే సమయంలో అదే ఊరికి చెందిన లీల అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పడు. కానీ ఒక రోజు ధైర్యం చేసుకుని లీలకు తన ప్రేమ విషయాన్ని చెబుతాడు హీరో. మరి హీరోయిన్ హీరో ప్రేమను అంగీకరించిందా? రిజెక్ట్ చేసిందా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
రెండు వారాల్లోనే ఓటీటీలోకి..
✨ A story that moved hearts and became a blockbuster sensation.#SriChidambaram
A Win Digital Premiere
Premieres on Feb 19 Only on @etvwin@worldofvamsi #SandhyaVasishta @VinayRatnam_ #ChintaVineeshaReddy #ChintaGopalaKrishnaReddy #ChintaRajasekharReddy @chandu_music… pic.twitter.com/EvW0ZQJOFP
— ETV Win (@etvwin) February 13, 2026
ఈ సినిమా పేరు శ్రీ చిదంబరం గారు..వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా హీరో హీరోయిన్లుగా నటించారు. వీళ్లతోపాటు గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 06న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఈనెల 19వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




