AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌ కోసం రంగంలోకి దిగిన విజయ్‌ సంగీత దర్శకుడు..!

సగానికి పైగా షూటింగ్‌ జరుపుకున్న ప్రభాస్‌ 20వ మూవీకి సంగీత దర్శకుడు షాక్‌ ఇచ్చినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రభాస్‌ కోసం రంగంలోకి దిగిన విజయ్‌ సంగీత దర్శకుడు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 21, 2020 | 3:05 PM

Share

సగానికి పైగా షూటింగ్‌ జరుపుకున్న ప్రభాస్‌ 20వ మూవీకి సంగీత దర్శకుడు షాక్‌ ఇచ్చినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ‘సైరా’ ఫేమ్ అమిత్‌ త్రివేదిని ఎన్నుకోగా.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ విషయంపై ఆయన ఓ సందర్భంలో క్లారిటీ కూడా ఇచ్చారు. ప్రభాస్‌ మూవీకి తాను పనిచేయడం లేదని ఆయన అన్నారు. దీంతో ప్రభాస్ మూవీకి సంగీతం ఎవరు అందించబోతున్నారు..? సాహోలాగే ఈ సినిమాకు కూడా అవుతుందా..? అని ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్‌ టీమ్‌ సంగీత దర్శకుడిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్‌ని ప్రభాస్ సినిమా కోసం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీ కోసం ప్రభాకరన్ ఇప్పటికే రెండు పాటలను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ మూవీ టైటిల్‌ గానీ, ఫస్ట్‌లుక్‌ గానీ విడుదలైన సమయంలో ప్రభాకరన్‌ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నట్లు టాక్. కాగా ప్రభాకరన్, విజయ్‌ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. పాటలు మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ టీమ్ అతడిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రభాస్ 20వ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. జగపతి బాబు, భానుశ్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Read This Story Also: అలా చేస్తే కరోనా కేసులు తగ్గుతాయట.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..
పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..
సీఎం సార్.. ప్లీజ్.. చదువు చెప్పడానికి టీచర్లను ఇవ్వండి సార్
సీఎం సార్.. ప్లీజ్.. చదువు చెప్పడానికి టీచర్లను ఇవ్వండి సార్
నోయిస్‌ నుంచి స్టైలిష్‌ లుక్‌తో కొత్త ఇయర్ బడ్స్‌
నోయిస్‌ నుంచి స్టైలిష్‌ లుక్‌తో కొత్త ఇయర్ బడ్స్‌
తక్కువ బడ్జెట్‌లో 360° థియేటర్ అనుభూతి కావాలా
తక్కువ బడ్జెట్‌లో 360° థియేటర్ అనుభూతి కావాలా
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే జొన్న పిండి లడ్డులు..
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే జొన్న పిండి లడ్డులు..
అదనపు ఆదాయం మీ చేతుల్లో: 3 'సైడ్ ఇన్‌కమ్' రహస్యాలు ఇవే
అదనపు ఆదాయం మీ చేతుల్లో: 3 'సైడ్ ఇన్‌కమ్' రహస్యాలు ఇవే