అలా చేస్తే కరోనా కేసులు తగ్గుతాయట.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్ధారణ పరీక్షలు అన్నవి కత్తికి రెండు వైపులా పదును లాంటివి.

అలా చేస్తే కరోనా కేసులు తగ్గుతాయట.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2020 | 2:42 PM

కరోనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్ధారణ పరీక్షలు అన్నవి కత్తికి రెండు వైపులా పదును లాంటివి. ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కరోనా కేసులు వెలుగులోకి వస్తాయి. అందుకే పరీక్షలు తగ్గించమని అధికారులకు చెప్పాను అని ట్రంప్‌ పేర్కొన్నారు. శనివారం ఓక్లహామాలోని టల్సాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు అక్కడకు వచ్చిన ట్రంప్ మద్దతుదారులందరూ కేరింతలు కొట్టారు. అయితే ఈ మాటలు ఆయన సరదాగా చేసినవా..? లేక నిజంగానే పరీక్షలు తగ్గించమని అధికారులు జారీ చేశారా..? అన్నది తెలీదు. కాగా అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆ దేశంలో 23లక్షల మందికి పైగా కరోనా సోకగా.. కరోనా పట్టికలో మొదటి స్థానంలో అమెరికా కొనసాగుతోంది. ఇక 9,73,055 మంది కోలుకోగా.. 1,21,986 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.

Read This Story Also: ‘ఫాదర్స్ డే రోజు’ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్.. ఆయనే నా బలం..!