AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీలో చేరనున్న విజయ్ తండ్రి..!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీ పక్కా ప్లాన్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో పేరు మోసిన వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

బీజేపీలో చేరనున్న విజయ్ తండ్రి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 13, 2020 | 2:09 PM

Share

Vijay Father BJP: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీ పక్కా ప్లాన్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో పేరు మోసిన వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు పలువురు బీజేపీలోకి వచ్చేందుకు స్కెచ్ వేస్తోంది. సినిమా రంగానికి చెందిన గౌతమి, రాధా రవి, కస్తూరి రాజా, గాయత్రి రఘురామ్ వంటి వారికి బీజేపీలోకి వెల్‌కమ్‌ పలికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారితో పాటు ఇప్పుడు మరో పేరు తమిళనాట వినిపిస్తోంది.

తమిళ స్టార్ నటుడు విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ బీజేపీలో చేరబోతున్నట్లు కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. కొందరైతే చంద్రశేఖర్ బీజేపీలో చేరిపోయారని వార్తలు సృష్టించారు. ఇక ఇవి కాస్త ఆ దర్శకుడి వద్దకు చేరడంతో.. వాటిపై చంద్రశేఖర్ స్పందించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ఇప్పట్లో రాజకీయాల్లో చేరే ఆలోచన కూడా తనకు లేనట్లు స్పష్టం చేశారు.

కాగా విజయ్‌ ఇటీవల నటిస్తున్న చిత్రాలన్నీ ఏదొక వివాదంలో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలను టార్గెట్‌ చేస్తున్నట్లు అందులోని కొన్ని సన్నివేశాలు ఉంటున్నాయి. దీంతో విజయ్ సినిమాలు విడుదలైన ప్రతిసారి ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఆయన మాస్టర్ షూటింగ్‌లో పాల్గొనే సమయంలోనూ విజయ్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Read More:

నవంబర్ నుంచి ‘విరాట పర్వం’లో రానా..!

‘సర్కారు వారి పాట’ను వాయిదా వేయాలనుకుంటోన్న మహేష్..!

Follow Us
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..
ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది?
ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది?
కాల్చిన లవంగంతో ముఖానికి మెరుపు! మొటిమలు, మచ్చలకు దివ్యౌషధం
కాల్చిన లవంగంతో ముఖానికి మెరుపు! మొటిమలు, మచ్చలకు దివ్యౌషధం
నగరవాసుల నుంచి సైబర్ నేరగాళ్లు గంటకు ఎంత దోచేస్తున్నారు అంటే
నగరవాసుల నుంచి సైబర్ నేరగాళ్లు గంటకు ఎంత దోచేస్తున్నారు అంటే