‘సింధుబాద్’ వచ్చేస్తున్నాడు.!

|

Jun 15, 2019 | 2:02 PM

తమిళంలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న హీరో విజయ్ సేతుపతి. ఈయన తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన తాజాగా చిత్రం ‘సింధుబాద్’. ఈ సినిమాకు ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకుడు. గతంలో ఈ సినిమా విడుదలకు కొన్ని ఆటంకాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసుకుని.. ఈనెల 21న […]

సింధుబాద్ వచ్చేస్తున్నాడు.!
Follow us on

తమిళంలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న హీరో విజయ్ సేతుపతి. ఈయన తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన తాజాగా చిత్రం ‘సింధుబాద్’. ఈ సినిమాకు ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకుడు. గతంలో ఈ సినిమా విడుదలకు కొన్ని ఆటంకాలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసుకుని.. ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు హీరో విజయ్ సేతుపతి తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ బోర్డు ప్రొడక్షన్స్, కె ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరోవైపు సేతుపతి.. తెలుగులో ‘సైరా’, ‘ఉప్పెన’ సినిమాల్లో నటిస్తున్నారు. అటు తమిళంలో కూడా ‘రణసింగం’ అనే సినిమాను కూడా మొదలు పెట్టాడు.