Vijay Rashmika: విజయ్‌ సినిమాకు లీకుల బెడద.. వైరల్‌ అవుతోన్న హైదరాబాద్‌ షూటింగ్‌ స్పాట్‌ పిక్స్‌..

|

Jun 14, 2022 | 2:56 PM

Vijay Rashmika: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ ఫోన్‌ (Smart phone) వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్నే నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా సినీమా ఇండస్ట్రీకి స్మార్ట్ ఫోన్‌లు శాపంగా మారుతున్నాయి. షూటింగ్‌ స్పాట్‌కు...

Vijay Rashmika: విజయ్‌ సినిమాకు లీకుల బెడద.. వైరల్‌ అవుతోన్న  హైదరాబాద్‌ షూటింగ్‌ స్పాట్‌ పిక్స్‌..
Follow us on

Vijay Rashmika: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ ఫోన్‌ (Smart phone) వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్నే నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా సినీమా ఇండస్ట్రీకి స్మార్ట్ ఫోన్‌లు శాపంగా మారుతున్నాయి. షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించిన వివరాలను ఎంతో గోప్యంగా ఉంచాలనుకునే చిత్ర యూనిట్‌కు నిరాశ మిగిలిస్తున్నాయి. ముఖ్యంగా బడా హీరోల షూటింగ్‌ స్పాట్‌ పిక్స్‌ లీక్‌ అవుతున్నాయి. తాజాగా తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ చిత్రానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. విజయ్‌, రష్మిక జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలో విజయ్‌, రష్మికలకు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు వ్యక్తులు చిత్రీకరణనకు సంబంధించిన స్టిల్స్‌ను కెమెరాలో బంధించారు. అంతటితో ఆగకుండా వాటిని సోషల్‌ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ విషయమై దర్శకుడు వంశీ అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఇకపై షూటింగ్ స్పాట్‌కు ఎవరూ స్మార్ట్‌ ఫోన్స్‌ తీసుకురావొద్దని కండిషన్‌ పెట్టినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే విజయ్‌ 66 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కి జోడిగా రష్మిక నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో ప్రకాశ్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌, యోగి బాబు, ప్రభు, సంగీత క్రిష్‌ నటిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2023 మొదట్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..