Liger Movie: లైగర్‌ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. మరోసారి పూరీ మార్క్‌ సాంగ్‌..

Liger Movie: పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh), విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ లైగర్‌ (Liger). ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల దృష్టి ఈ సినిమాపై పడింది. పూరి తొలిసారి పాన్‌ ఇండియాగా...

Liger Movie: లైగర్‌ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. మరోసారి పూరీ మార్క్‌ సాంగ్‌..

Edited By:

Updated on: Jul 06, 2022 | 6:38 PM

Liger Movie: పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh), విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ లైగర్‌ (Liger). ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల దృష్టి ఈ సినిమాపై పడింది. పూరి తొలిసారి పాన్‌ ఇండియాగా తెరకెక్కిస్తోన్న చిత్రం కావడం, కరణ్‌ జోహర్‌ వంటి బాలీవుడ్‌ అగ్ర నిర్మాత భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది.  ఈ సినిమాలో విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, టీజర్స్‌ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేస్తోంది.

తాజాగా విజయ్‌ దేవరకొండ బోల్డ్‌ పిక్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకున్న లైగర్‌ మూవీ యూనిట్ మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలోని ‘అక్‌డి పక్‌డి’ అనే పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు. అనన్య, విజయ్‌ల మధ్య తెరకెక్కించిన ఈ పాట టీజర్‌ను 8 జూలైన విడుదల చేయనున్న చిత్ర యూనిట్‌ పూర్తి పాటను జూలై 11న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఇది ఒక పార్టీ సాంగ్‌లా కనిపిస్తోంది. ఈ పాట హిందీ వెర్షన్‌ లిరిక్స్‌ను మోహ్‌సిన్‌ షైక్‌, అజీమ్‌ దయాని అందించగా లిజియో జార్జ్‌ సంగీతం అందించారు. తెలుగు విషయానికొస్తే అనురాగ్‌ కుల్కర్నీ, రమ్య బెహరా ఆలపించారు. భాస్కర భట్ల రవికుమార్‌ లిరిక్స్‌ అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..