Vijaya Raghavan Movie Update: విభిన్నమైన సినిమాలను ఎంచుకునే నటులలో విజయ్ ఆంటోని ఒకరు. బిచ్చగాడు, కిల్లర్, నకిలి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో ‘విజయ్ రాఘవన్’ సినిమాలో మెయిల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇందులో ఆత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించగా.. ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టీడీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.
మే 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా.. విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ఓ మాస్ ఏరియాలో పిల్లలు పక్కదారులు పట్టకుండా.. చదువు గొప్పతనాన్ని వారికి వివరించి.. ఆ పిల్లల ఉన్నతికి పాటుపడే యువకుడి స్టోరీ విజయ్ రాఘవన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో ఈ మూవీ మే 14న రిలీజ్ చేయనున్నాం అన్నారు విజయ్. ఇక గతంలో విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు ఆనంద కృష్ణన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మదర్ సెంటిమెంట్, ప్రేమ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ను పక్కాగా మిక్స్ చేసి విజయ్ రాఘవన్ సినిమాను రూపొందించాడని… అందుకే తన తదపరి సినిమా ‘బిచ్చగాడు 2’కి కూడా ఆయనకే దర్శకత్వ బాధ్యతలను అప్పగించానంటూ చెప్పిన సంగతి తెలసిందే.
Also Read: Balakrishna: ‘అఖండ’ కోసం వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. శ్రీకాంత్‌తో తలపడేందుకేనా..
ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…
Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్… ఆశయాన్ని తీరుస్తామంటున్న అభిమానులు..