ఎన్టీఆర్ ‘వయసునామి’కి జపాన్ జంట డ్యాన్స్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే

జూనియర్ ఎన్టీఆర్‌కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనకు ఇక్కడే కాదు జపాన్‌లో కూడా అభిమానులున్నారు.

ఎన్టీఆర్ వయసునామికి జపాన్ జంట డ్యాన్స్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే

Edited By:

Updated on: Sep 15, 2020 | 3:22 PM

NTR Vayasunami Song: జూనియర్ ఎన్టీఆర్‌కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనకు ఇక్కడే కాదు జపాన్‌లో కూడా అభిమానులున్నారు. జనతా గ్యారేజ్‌లో నటించే సమయంలో ఓ జపాన్ అభిమాని ఎన్టీఆర్ కోసం ఇక్కడ వరకు వచ్చి మరీ అతడితో ఫొటో తీసుకొని వెళ్లారు. ఇదిలా ఉంటే ఓ జపాన్ జంట ఇప్పుడు ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. జూలైలో అశోక్ చిత్రంలోని ‘గోల గోల రంగోలా’, సింహాద్రిలోని ‘చీమ చీమ’ పాటలకు స్టెప్పులు వేసిన ఓ జంట.. తాజాగా కంత్రి సినిమాలోని ‘వయస్సునామి’ పాటకు డ్యాన్స్ కట్టారు.

అయితే ఏదో డ్యాన్స్ వేసినట్లు కాకుండా ఈ సారి తమలోని వైవిధ్యాన్ని ఆ ఇద్దరు బయటపెట్టారు. పాటలో ఎన్టీఆర్, హన్సిక ధరించినట్లుగానే డ్రస్‌లు ధరించిన ఆ ఇద్దరు.. వారిలాగే స్టెప్పులు వేస్తూ ఇంటిని శుభ్రం చేశారు. ఈ వీడియోలో ఆ జంట పిల్లలు కూడా మధ్య మధ్యలో భాగం అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. కేవలం ఎన్టీఆర్ అభిమానులనే కాదు ఇటు డ్యాన్స్‌ని ఇష్టపడే వారు కూడా వారిద్దరి స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను చూసేయండి.

Read More:

స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఇలా జరగడం శ్రీవారి ఆలయ చరిత్రలో తొలిసారి: ప్రధానార్చకులు