Actress Sharada: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. గుండె పోటుతో సీనియర్ నటి కన్నుమూత..

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటి కోజికోడ్‌ శారద గుండెపోటుతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. 84 ఏళ్ల వయసున్న ఆమె గత కొంతకాలంగా

Actress Sharada: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. గుండె పోటుతో సీనియర్ నటి కన్నుమూత..

Updated on: Nov 09, 2021 | 8:39 PM

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటి కోజికోడ్‌ శారద గుండెపోటుతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. 84 ఏళ్ల వయసున్న ఆమె గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి గుండెలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు శారదను సమీపంలోని కోజికోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కానీ ఆమె కోలుకోలేకపోయింది. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ సందర్భంగా శారద మృతి కేరళ సినీ పరిశ్రమకు తీరని లోటని కేరళ ఫిల్మ్‌ అండ్‌ కల్చరల్ మంత్రి సాజి చెరియన్‌ సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA) ఆమెకు నివాళి అర్పించింది.

వందకు పైగా సినిమాల్లో..
రంగ స్థలం నాటకాలతో తన కెరీర్‌ను మొదలెట్టారు శారద. 1979లో కేరళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నాలుగు దశాబ్దాలుగా హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందకు పైగా సినిమాల్లో నటించారు. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా తన నటనా ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా మలయాళ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్‌ హీరోలు శారద మృతికి సంతాపం వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మోహన్‌లాల్‌ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు నివాళి అర్పించారు.

Raj Kundra: బెయిల్ తర్వాత మొదటిసారిగా కనిపించిన రాజ్ కుంద్రా.. భార్యతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలో బిజీబిజీ..

NTR Koratala: ఎన్టీఆర్‌ కొత్త మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది.. కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది..

VC Sajjanar: అల్లు అర్జున్‌ ర్యాపిడో యాడ్‌పై ఆర్టీసీ అభ్యంతరం.. స్టైలిష్‌ స్టార్‌కు లీగల్‌ నోటీసులు పంపిన సజ్జనార్‌..