మంచి మనుషుల్లా బయటికి రావాలి: వెంకటేష్

| Edited By:

May 04, 2020 | 6:35 AM

కరోనాతో ప్రపంచమంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుండగా.. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారు.

మంచి మనుషుల్లా బయటికి రావాలి: వెంకటేష్
Follow us on

కరోనాతో ప్రపంచమంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుండగా.. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వారి సేవలకు గుర్తుగా ఇవాళ భారత్‌లో కరోనా చికిత్స అందిస్తోన్న ఆసుపత్రులపై భారత నేవీ పూల వర్షం కురిపించింది. కాగా కరోనాపై యుద్దం చేస్తోన్న వారియర్స్‌పై సినీ నటుడు వెంకటేష్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన వెంకటేష్.. ”ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మెడికల్ సిబ్బంది రియల్ హీరోలుగా నిలిచారు. వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతి క్షణం మన కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మనకోసం కష్టపడుతున్న అందరికీ ప్రత్యేక కృతఙ్ఞతలు. వారి కష్టాన్ని గుర్తించి.. ఆ కష్టానికి ప్రతిఫలంగా మనమందరం మంచి మనుషుల్లా బయటికి రావాలని ఆశిస్తున్నా” అని అన్నారు.

Read This Story Also: నేలపై రూ.500 నోట్లు.. ప్రజల్లో భయాందోళన..!