నేలపై రూ.500 నోట్లు.. ప్రజల్లో భయాందోళన..!

ఇంతకుముందు నేలపై కరెన్సీ నోట్లు పడితే తీసుకునేందుకు ఏ మాత్రం సంశయించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.

నేలపై రూ.500 నోట్లు.. ప్రజల్లో భయాందోళన..!
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 7:35 PM

ఇంతకుముందు నేలపై కరెన్సీ నోట్లు పడితే తీసుకునేందుకు ఏ మాత్రం సంశయించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కరెన్సీ నోటు కనిపించినా.. తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. దానికి తోడు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హరియాణా కైతల్‌లోని కర్ణ్‌ విహార్‌లో దుండగులు కరెన్సీ నోట్లు వెదజల్లి వెళ్లారు. జింద్ బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో కొందరు రూ.500 నోట్లను వెదజల్లి వెళ్లారు. వాటిని గమనించిన స్థానికులు సిటీ స్టేషన్‌ హౌస్ ఆఫీసర్, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కరెన్సీ నోట్లను శానిటైజింగ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ కరెన్సీ నోట్ల విలువ రూ.15వేలు ఉందని.. కరోనా నేపథ్యంలో ప్రజలు నోట్లు తీసుకోవడానికి భయపడ్డారని పోలీసులు తెలిపారు.

Read This Story Also: బ్యాక్‌ టు ఫామ్‌.. నియంత పనులు ప్రారంభించేసిన కిమ్..!