Veera Simha Reddy Release Updates: తెలంగాణలోనూ వీరసింహా రెడ్డి హంగామా.. ఏకంగా 150 కార్లలో ర్యాలీగా..
Veera Simha Reddy Movie Updates: నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపి చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుము గురువారం విడుదలైన ఈ సినిమా హంగామా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో..

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపి చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుము గురువారం విడుదలైన ఈ సినిమా హంగామా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో తెల్లవారు జామున 4 గంటల నుంచే థియేటర్లలో హంగామా మొదలైంది. థియేటర్ల వద్ద అభిమానులు కోలాహలం మాములుగా లేదు. మరోవైపు భాగ్యనగరంలోనూ పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు సందడి చేశారు. ఇప్పటికే బాలకృష్ణ, గోపి చంద్ మలినేని అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాలయ్య అభిమానులు హంగామా చేశారు. ఏకంగా అమెరికాలో కొబ్బరి కాయలు కొడుతూ, థియేటర్లలో పేపర్లు చింపుతూ సందడి చేస్తారు. ఖండంతరాలు దాటిన అభిమానానికి సంబంధించిన వీడియోలు నెట్టంట తెగ హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో సందడి వాతావరణం నెలకొంది.
LIVE NEWS & UPDATES
-
తెలంగాణలోనూ వీరసింహారెడ్డి హంగామా..
తెలంగాణలోనూ వీరసింహా రెడ్డి హంగామా కొనసాగుతోంది. నిజామాబాద్‌లో ఫ్యాన్స్ రచ్చ చేశారు. సినిమాను వీక్షించేందుకు బాలయ్య అభిమానులు బోధన్ నుంచి ఏకంగా 150 కార్లలో ర్యాలీగా వచ్చారు.
-
మ్యాన్షన్ హౌజ్‌తో అభిషేకం..
బాలయ్య అభిమానుల సందడికి హద్దే లేకుండా పోతోంది. తమ అభిమాన హీరో సినిమా విడుదలను పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాడిపత్రి పట్టణంలో వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ సందర్భంగా బాలకృష్ణ కటౌట్ కు మద్యంతో అభిషేకం చేశారు. మ్యాన్షన్ హౌజ్‌తో కటౌట్‌కు అభిషేకం చేసి వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు.
-
-
అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ అరాచకం.
అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్ అనే పట్టణంలో సినిమ్యాక్స్ థియేటర్‌లో అభిమానులు సందడి చేశారు. థియేటర్ ముందు కొబ్బరి కాయలు కొడుతూ హంగామా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
అభిమానంలో ఇది మరో లెవల్..
వీరసింహారెడ్డి సినిమా థియేటర్ల వద్ద బాలయ్య బాబు అభిమానుల సందడి మాములుగా లేదు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అభిమానులు మేకను కోసి పోస్టర్‌కు రక్తాభిషేకం చేశారు. అనంతరం జై బాలయ్య, జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
-
అర్ధాంతరంగా నిలిపేసిన వీరసింహారెడ్డి షో..
అమెరికాలో వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారు. వర్జీనియాలో వీరసింహా రెడ్డి సినిమా ఆడుతోన్న ఓ థియేటర్‌లో అభిమానులు పేపర్లు చించి హడావిడి చేశారు. దీంతో పోలీసులు అర్ధాంతరంగా షో నిలిపివేశారు. థియేటర్‌లో ఫ్యాన్స్ హంగామాను అడ్డుకున్నారు. థియేటర్‌లో ఇలాంటివి అంగీకరించేదిలేదంటూ హెచ్చరించారు.
-
-
ఇదేం రచ్చ సామీ..
వీరసింహా రెడ్డి థియేటర్లలో అభిమానుల కోలాహలం కొనసాగుతోంది. థియేటర్లలో ఫ్యాన్స్ పేపర్ల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
Jai Balayya Song ?? Bramaramba Erupted ?????
Jindhabad Balayya Babu ?#BlockBusterVeeraSimhaReddy pic.twitter.com/Ftqydg7QQ2
— Gopi Nath NBK (@Balayya_Garu) January 12, 2023
-
వీరసింహా రెడ్డి ఓటీటీ ఎందులో తెలుసా.?
వీరసింహా రెడ్డి సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే సినిమా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
-
వీరసింహా రెడ్డిని వీక్షిస్తున్న విజయేంద్ర ప్రసాద్..
సీనీ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ వీరసింహారెడ్డి సినిమాను వీక్షిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఐ మ్యాక్స్‌లో ప్రదర్శిస్తోన్న సినిమాకు ఉదయం 8 గంటలకు విజయేంద్ర ప్రసాద్ వచ్చారు.
-
బెంగళూరులోనూ వీరనరసింహా రెడ్డి సందడి.
బాలయ్య అభిమానులు పక్క రాష్ట్రాల్లోనూ హంగామా చేస్తున్నారు. బెంగళూరు తులసి థియేటర్‌లో వీరనరసింహా రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు పోటేత్తారు. బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. థియేటర్లో భారీ హోర్డింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
Tulasi theatre, Marathahalli, Bengaluru Never before celebrations #VeeraSimhaReddy pic.twitter.com/kMS4Gijuk6
— మదనపల్లి ఎన్టీఆర్ అభిమానులు (@MplNTRfans9) January 12, 2023
-
భ్రమరాంబలో బాలయ్య..
వీరనరసింహా రెడ్డి సినిమాను నట సింహం బాలకృష్ణ అభిమానులతో కలిసి వీక్షించారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానులతో కలిసి చిత్ర దర్శకుడు గోపీ చంద్ మలినేనితో సినిమాను చూశారు. బాలకృష్ణ థియేటర్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
The Lion is here at Bramarambha Theatre? Jai Balayya✊#VeeraSimhaReddy pic.twitter.com/2toHaVJhQ0
— Balayya Trends (@NBKTrends) January 12, 2023
-
మధ్యలో ఆగిపోయిన వీరనరసింహా రెడ్డి సినిమా.
నంద్యాల కోవెలకుంట్లలోని ఏవీఆర్ థియేటర్‌లో సినిమా నిలిపివేత మధ్యలో ఆగిపోయింది. సాంకేతిక లోపం కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. అర్థగంటకు పైగా ఆగిన సినిమా. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ సిబ్బందితో వాగ్విదాంలకు దిగారు. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపి చిత్రాన్ని ప్రదర్శిస్తామని థియేటర్ ఓనర్స్ చెబుతున్నారు.
-
ప్రసాద్ ఐమాక్స్ వద్ద వీరసింహ సందడి.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద వీరసింహ రెడ్డి సందడి మొదలైంది. తొలి షో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు హంగామా చేస్తున్నారు. జై బాలయ్య నినాదాలతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక మరికొంత మంది అభిమానులు బాలయ్య గెటప్‌లు, జై బాలయ్య అని రాసి ఉన్న టీ షర్ట్స్‌తో సందడి చేస్తున్నారు.
-
అమెరికాలో వీరసింహా రెడ్డి హంగామా.
వీరసింహా రెడ్డి హంగామా ఖండంతరాలు దాటేసింది. అమెరికాలోనూ బాలయ్య ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఆదివారం అమెరికాలోని కనాస్ పట్టణంలో కార్లతో రచ్చ చేశారు అభిమానులు. నెంబర్ ప్లేట్లపై బాలయ్య రాసి ఉన్న కార్లతో NBK ఆకారంలో కార్లను ఏర్పాటు చేశారు.
NBK’S #veerasimhareddy ?mania in Kansas City., USA on SUNDAY pic.twitter.com/fo4DpgiXJi
— Gopichandh Malineni (@megopichand) January 11, 2023
-
సినిమా చూసిన నారా బ్రాహ్మణి
వీరసింహారెడ్డి సినిమాకు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే హైదాబాదర్‌లో కూకట్‌పల్లిలోని భ్రమరాంజ థియేటర్‌లో నారా బ్రాహ్మణి సినిమాను వీక్షించారు. ఇక్కడే బాలకృష్ణ సినిమా యూనిట్‌తో సినిమాను చూశారు.
Published On - Jan 12,2023 7:29 AM




