AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటలు లేకుండా ఫ్లాప్ కొట్టారు.. మాట్లాడుకొని హిట్ కొట్టారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ పాత్రలో నటించిన వరుణ్.. అదిరిపోయే యాక్టింగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా వరుణ్ హవా కొనసాగుతోంది. ఇక ఈ హిట్‌తో ఈ ఏడాదిలో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్. […]

మాటలు లేకుండా ఫ్లాప్ కొట్టారు.. మాట్లాడుకొని హిట్ కొట్టారు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 23, 2019 | 2:16 PM

Share

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ పాత్రలో నటించిన వరుణ్.. అదిరిపోయే యాక్టింగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా వరుణ్ హవా కొనసాగుతోంది. ఇక ఈ హిట్‌తో ఈ ఏడాదిలో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్. ఇదిలా ఉంటే ఈ మూవీతో రెండోసారి జోడీ కట్టారు వరుణ్ తేజ్, పూజా హెగ్డే.

ఈ ఇద్దరు మొదటిసారి ‘ముకుంద’లో కలిసి నటించారు. వరుణ్ తేజ్ ఈ చిత్రం ద్వారానే హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. అయితే కథానుగుణంగా ఈ ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా ఉండదు. సినిమా పూర్తయ్యే వరకు కేవలం కళ్లతో మాత్రమే ఇరువురు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. రాధా కృష్ణల ప్రేమ కథను దృష్టిలో పెట్టుకొనే ఈ పాత్రలను తాను రాశానని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కాగా కథనంలో బలం లేకపోవడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయంగా నిలిచింది.

ఇక ఇప్పుడు ఇదే జోడి గద్దలకొండ గణేష్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ఎల్లువచ్చి గోదారమ్మ పాటతో పాటు సినిమా మొత్తంగా దాదాపు 15 నిమిషాలు మాత్రమే పూజ పాత్ర ఉంటుంది. ఇక వీరి మధ్య సీన్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఉన్నంతసేపైనా వీరిద్దరి మధ్య కొన్ని డైలాగ్‌లు ఉంటాయి. దీంతో అప్పుడు మాట్లాడుకోకుండా ఫ్లాప్ కొట్టారు. ఇప్పుడు మాట్లాడుకొని హిట్ కొట్టారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి జోడీకి మరో కామన్ పాయింట్ సంగీత దర్శకుడు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే నటించిన రెండు చిత్రాలకు మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించడం విశేషం.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో