బిగ్‌బాస్‌3 : బిగ్‌బాస్ హౌస్ నుంచి హిమజ ఔట్..!

శనివారం ఫేక్ ఎలిమినేషన్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఆదివారం మాత్రం నిజంగానే ఎలిమేనేషన్ కొనసాగించారు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్3 ఎలిమినేషన్ రౌండ్‌లో హిమజ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్‌ ఫేక్ ఎలిమినేషన్‌తో సీక్రెట్ రూంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే హిమజ మాత్రం ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ వారం జరిగిన ఎలిమినేషన్‌ రౌండ్‌లో మహేశ్‌ విట్టా, రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజ నామినేట్‌ అయ్యారు. అయితే రెండు నామినేషన్లు ఉంటాయన్న […]

బిగ్‌బాస్‌3 : బిగ్‌బాస్ హౌస్ నుంచి హిమజ ఔట్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 23, 2019 | 5:40 AM

శనివారం ఫేక్ ఎలిమినేషన్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఆదివారం మాత్రం నిజంగానే ఎలిమేనేషన్ కొనసాగించారు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్3 ఎలిమినేషన్ రౌండ్‌లో హిమజ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్‌ ఫేక్ ఎలిమినేషన్‌తో సీక్రెట్ రూంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే హిమజ మాత్రం ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ వారం జరిగిన ఎలిమినేషన్‌ రౌండ్‌లో మహేశ్‌ విట్టా, రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజ నామినేట్‌ అయ్యారు. అయితే రెండు నామినేషన్లు ఉంటాయన్న హోస్ట్.. రాహుల్‌ను శనివారం ఫేక్ ఎలిమినేషన్ చేసి.. సీక్రెట్ రూం‌కి పంపారు. దీంతో ఆదివారం నామినేషన్లలో మహేష్, హిమజ నిలిచారు. వీరిలో హిమజ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు.

మరోవైపు ఆదివారం ఎపిసోడ్ హీరో వరుణ్ తేజ్ ఎంట్రీతో హౌస్ మొత్తం జోష్ నిండింది. వరుణ్ తన పంచులతో హౌస్ మేట్స్‌ను ఓ ఆట ఆడేసుకున్నారు. పునర్నవిని వరుణ్ పంచులతో ఆడుకున్నాడు. అయితే ఎలిమినేషన్‌తో బయటకు వచ్చిన హిమజ మాత్రం కన్నీటి పర్యంతమైంది. బిగ్ బాస్ హౌస్‌లో తన జర్నీకి సంబంధించిన వీడియోను చూసి ఎమోషనల్‌‌కు గురైంది. బయట తనకు ఎదురైన పరిస్థితులను బట్టి.. ఎవ్వరితోనూ అంత ఈజీగా కలవలేనని చెప్పుకొచ్చింది. హౌస్‌లో కూడా తాను అలా ఉండే సరికి తనకెప్పుడు ఎవరూ మద్దతు పలకలేదంటూ ఏడ్చింది.