Varalaxmi Sarathkumar : ఆద్యగా అదరగొట్టనున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

తనదైన నటనతో తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. మాస్ మహా రాజా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మగా నటించి అదరగొట్టారు వరలక్ష్మీ శరత్ కుమార్.

Varalaxmi Sarathkumar : ఆద్యగా అదరగొట్టనున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..
Varalakshmi

Updated on: Mar 05, 2022 | 8:32 PM

Varalaxmi Sarathkumar : తనదైన నటనతో తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. మాస్ మహా రాజా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మగా నటించి అదరగొట్టారు వరలక్ష్మీ శరత్ కుమార్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుతున్నారు వార లక్ష్మీ. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ సినిమాలో అంజనమ్మ పాత్రలో నటిస్తున్నారు వరలక్ష్మీ.. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, హెబ్బాపటేల్ ప్రధాన పాత్రల్లో ‘ఆద్య` అనే సినిమా చేస్తున్నారు.

వింటేజ్ పిక్చర్స్, శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, బ్యానర్ మీద S.రజినీకాంత్. P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), నిర్మిస్తున్నారు. , డి.ఎస్.కె. స్క్రీన్  ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఆద్య చిత్రానికి ఎం.ఆర్.. కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్నారు. నేడు శనివారంనాడు వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆద్య సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ ఆమె సరికొత్తగా కనిపించారు వర లక్ష్మీ. ఇప్పటికే ఈ లుక్ కు మంచి స్పందన లబిస్తోంది.  జనవరి 11నే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: బాబు బంగారం.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం మహేష్ మరో అడుగు..

Samantha: సామ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా.. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌!..

F3 Movie : ఎఫ్ 3 సెట్‌లో నానా రచ్చ చేసిన నాగ రత్తమ్మ.. వెంకీ- వరుణ్ ఏం చేశారంటే..!