Vaishnav Tej: అవకాశం వస్తే పవర్‌స్టార్‌ ఆ సినిమాను రీమేక్‌ చేయాలనుంది.. మనసులో మాట చెప్పేసిన వైష్ణవ్‌..

Vaishnav Tej: 'ఉప్పెన' చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌. పేరుకు తొలి సినిమానే అయినా ఎంతో పరిణితితో కూడిన నటనతో ప్రేక్షకులను...

Vaishnav Tej: అవకాశం వస్తే పవర్‌స్టార్‌ ఆ సినిమాను రీమేక్‌ చేయాలనుంది.. మనసులో మాట చెప్పేసిన వైష్ణవ్‌..
Vaishnav Tej

Updated on: Sep 02, 2022 | 8:28 AM

Vaishnav Tej: ‘ఉప్పెన’ చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌. పేరుకు తొలి సినిమానే అయినా ఎంతో పరిణితితో కూడిన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇండస్ట్రీలోకి గ్రాండ్‌ విక్టరీతో ఎంట్రీ ఇచ్చాడు. తొలిసినిమాతోనే భారీ క్రేజ్‌ను దక్కించుకున్న వైష్ణవ్‌ రెండో చిత్రం కొండ పాలెంలోనూ కమర్షియల్‌ జోలికి వెళ్లకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకొని తన ఎంపిక ఎలా ఉంటుందో మరోసారి చాటి చెప్పాడు. ఇక ఈ యంగ్ హీరో ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం వైష్ణవ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకే రకమైన జానర్‌ కథలను చేయాలని లేదన్న ఆయన, దారిలోకి వచ్చిన వాటిలో ఏ కథైతే ఉత్తేజపరుస్తుందో.. అది చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

ఇక మెగా ఫ్యామిలీలో ఎవరి సినిమా రీమేక్‌ చేస్తాన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘మామయ్యలు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ల సినిమాలు చూస్తూనే పెరిగాను. వాళ్లు చేసిన చిత్రాలను మళ్లీ టచ్‌ చేయాలని అసలు అనుకోను. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది బాగుంటుంది, నువ్వే చెయ్యాలి అంటే ‘బద్రి’ రీమేక్‌ చేయాలని ఉంది’ అని మనసులో మాట చెప్పేశాడు. మరి తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్‌ తేజ్‌ కెరీర్‌ను ‘రంగ రంగ వైభవంగా’ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..