సోనూసూద్‌కి అరుదైన అవార్డు ఇచ్చిన ఐరాస

| Edited By:

Sep 29, 2020 | 5:14 PM

ప్రముఖ నటుడు సోనూసూద్‌కి అరుదైన అవార్డు వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ సోనూసూద్‌కి

సోనూసూద్‌కి అరుదైన అవార్డు ఇచ్చిన ఐరాస
Follow us on

Sonu Sood Award: ప్రముఖ నటుడు సోనూసూద్‌కి అరుదైన అవార్డు వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ సోనూసూద్‌కి ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును ప్రకటించింది. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులు, విద్యార్థులకు సేవలు అందించినందుకు గానూ ఆయనకు ఈ అవార్డు లభించింది. వర్చువల్ కార్యక్రమంలో ఈ అవార్డును సోమవారం సాయంత్రం ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఐరాస అవార్డును అందుకున్న హాలీవుడ్ నటులు ఏంజెలినీ జోలీ, డేవిడ్‌ బెక్‌హామ్‌, లియోనార్డో డి కాప్రియో, బాలీవుడ్ నటి ప్రియాంక తదితరుల సరసన సోనూ చేరారు.

దీనిపై సోనూ మాట్లాడుతూ.. ఇదొక గౌరవం. ఐరాస గుర్తింపు పొందడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నాకు వీలైన విధంగా ఏ ప్రయోజనం ఆశించకుండా నా దేశ ప్రజలకు చేయగలిగిన కొద్దిపాటి సాయాన్ని చేశా. నా సేవలను గుర్తించి, అవార్డును అందించడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.

Read More:

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. గర్భిణులకు ‘వైఎస్సార్ ఆసరా’

Prabhas Adipurush: ‘సీత’గా అనుష్క.. క్లారిటీ ఇచ్చిన దేవసేన