ఆ హీరోయిన్‌నే కావాలంటోన్న త్రివిక్రమ్!

హైదరాబాద్: త్రివిక్రమ్ సినిమాలు ఎంత ఆకట్టకునే విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తన సినిమాలకు హీరోయిన్ ఎంపికను కూడా కథకు తగిన విధంగా కరెక్ట్‌గా ఎంచుకుంటాడనే పేరు కూడా త్రివిక్రమ్‌కు ఉంది. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కబోతోందన్న సంగతి తెలిసిందే. ఇందుకు హీరోయిన్ వేటలో ఉన్న మాటల మాంత్రికుడు పూజూ హెగ్డేనే తీసుకోవాలని భావిస్తున్నట్టు వినిపిస్తోంది. అరవింద సమేత మూవీలో పూజా హెగ్డే చేసిన పాత్ర నచ్చి […]

ఆ హీరోయిన్‌నే కావాలంటోన్న త్రివిక్రమ్!
Follow us
Vijay K

|

Updated on: Mar 06, 2019 | 11:47 AM

హైదరాబాద్: త్రివిక్రమ్ సినిమాలు ఎంత ఆకట్టకునే విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తన సినిమాలకు హీరోయిన్ ఎంపికను కూడా కథకు తగిన విధంగా కరెక్ట్‌గా ఎంచుకుంటాడనే పేరు కూడా త్రివిక్రమ్‌కు ఉంది. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కబోతోందన్న సంగతి తెలిసిందే. ఇందుకు హీరోయిన్ వేటలో ఉన్న మాటల మాంత్రికుడు పూజూ హెగ్డేనే తీసుకోవాలని భావిస్తున్నట్టు వినిపిస్తోంది. అరవింద సమేత మూవీలో పూజా హెగ్డే చేసిన పాత్ర నచ్చి బన్నీతో తీయబోతున్న కథకు ఆమె సరిపోతుందని త్రివిక్రమ్ అనుకున్నాడట. అయితే త్రివిక్రమ్ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు.

అంతకుముందు బన్నీ, పూజా హెగ్డేలు కలిసి దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో కలిసి నటించారు. వీరి జోడీ ఈ మూవీలో మెప్పించింది. ఇక త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో ఈ మూవీ మూడవది కాబోతోంది. అంతకుముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి విడుదలై మంచి హిట్ సాధించాయి. ఈ సినిమా కూడా అదే విధంగా సూపర్ హిట్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.