Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన జగన్.. ఏమన్నారంటే

|

Dec 13, 2024 | 6:23 PM

అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ సెలబ్రెటీలతో పాటూ రాజకీయనాయకులు కూడా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తున్నారు.

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన జగన్.. ఏమన్నారంటే
Allu Arjun, Jagan Mohan reddy
Follow us on

సినీ నటుడు అల్లు అర్జున్ కు ఊహించని షాక్ తగిలింది. సంధ్య థియేటర్ లో పుష్ప సినిమా ప్రీమియాస్ సందర్భముగా జరిగిన తొక్కిసలాట లో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. తాజగా ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే హైకోర్టులో అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. దాంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. అల్లు అర్జున్  అరెస్ట్ పై సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులూ స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై జగన్ ఖండించారు.

హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అని జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

ఇరు వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు అల్లు అర్జున్. దాని పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. కానీ హైకోర్టులోనూ అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. క్వాష్ పిటీషన్ ను క్యాన్సిల్ చేసింది కోర్టు. అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దాంతో అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.