Nikhil Siddharth : లవ్ స్టోరీస్ అంటే ఫస్ట్ నుంచి నాకు భయం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యంగ్ హీరో నిఖిల్..

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకరు. ఈ కుర్ర మహీరో వుబ్బినమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు.

Nikhil Siddharth : లవ్ స్టోరీస్ అంటే ఫస్ట్ నుంచి నాకు భయం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యంగ్ హీరో నిఖిల్..

Updated on: Jun 02, 2021 | 7:23 AM

Nikhil Siddharth :

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకరు. ఈ కుర్ర మహీరో వుబ్బినమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన కెరియర్ లో మంచి విజయాన్ని సొంతచేసుకున్న ‘కార్తీకేయ’ సినిమా సీక్వెల్ ‘కార్తికేయ 2′ ను చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీతో పాటు ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈ సినిమాలోఅనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రలను సృష్టిస్తున్నాడట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిఖిల్.. పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ’18 పేజెస్’ కథ వినగానే నాకు భలే అనిపించింది. వెంటనే ఓకే చేసా. ఇక సుకుమార్ రైటింగ్స్ కి బన్నీ వాస్ తోడయ్యారంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ’18 పేజీస్’ కథలో నన్ను నేను చూసుకోగలిగా అన్నారు. అలాగే లవ్ స్టోరీస్ అంటే ఫస్ట్ నుంచి నాకు భయం. ప్రేమకథ అంటే విడిపోవడం కలవడమే కదా అనిపిస్తుంటుంది. అందుకే ఇప్పటి వరకు థ్రిల్లర్ సినిమాలు మిస్టరీ అడ్వంచర్ చిత్రాలు చేస్తూ వచ్చాను. సుకుమార్ కథలు భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ సినిమాను ఓకే చేశా అని చెప్పుకొచ్చాడు నిఖిల్. ప్రేమకథల్లో ‘ఖుషీ’ తరహా సినిమాలంటే ఇష్టమే కానీ నన్ను లవర్ బాయ్ గా యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం ఉండేది..కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో  నా భార్య ఊహించుకునే నటించా. పెళ్లి తర్వాత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం మరింత ఈజీ అయిందనిపిస్తుంది” అని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

గంగిరెద్దును ఆడిస్తు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యువకుడు.వైరల్ గా మారిన వీడియో :GV Prakash Video.

Chiranjeevi Konidela: ఆ చిన్నారి చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది : మెగాస్టార్ చిరంజీవి