Naveen polishetty: సూపర్ సినిమా మిస్సు.. మనోడికి.. లుక్కు లేదు పాపం..!

సూపర్ డూపర్ ట్యాలెంట్ ఉన్నా.. తన ట్యాలెంట్‌కు తగ్గట్టు కష్టపడే తత్వం ఉన్నా కూడా.. ఎందుకో తన కెరీర్లో వెనుక పడ్డారు నవీన్ పొలిశెట్టి. ఎంత ప్రయత్నించినా.. ఇంట గెలవకపోవడంతో.. కనీసం రచ్చ గెలిచే ప్రయత్నం చేశారు ఈ హీరో. యాడ్స్‌లో నటించారు.. స్టేజ్ ఫోలు చేశారు.. స్టాండప్‌ కమెడియన్‌గా కూడా తన ట్యాలెంట్ చూపించారు. ఇక ఈ క్రమంలోనే లక్కీగా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడి ఓ క్రేజీ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసి.. సూపర్ డూపర్ హిట్టు కొట్టారీయన.

Naveen polishetty: సూపర్ సినిమా మిస్సు.. మనోడికి.. లుక్కు లేదు పాపం..!
Naveen Polishetty

Updated on: Oct 13, 2023 | 8:23 PM

సూపర్ డూపర్ ట్యాలెంట్ ఉన్నా.. తన ట్యాలెంట్‌కు తగ్గట్టు కష్టపడే తత్వం ఉన్నా కూడా.. ఎందుకో తన కెరీర్లో వెనుక పడ్డారు నవీన్ పొలిశెట్టి. ఎంత ప్రయత్నించినా.. ఇంట గెలవకపోవడంతో.. కనీసం రచ్చ గెలిచే ప్రయత్నం చేశారు ఈ హీరో. యాడ్స్‌లో నటించారు.. స్టేజ్ ఫోలు చేశారు.. స్టాండప్‌ కమెడియన్‌గా కూడా తన ట్యాలెంట్ చూపించారు. ఇక ఈ క్రమంలోనే లక్కీగా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడి ఓ క్రేజీ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసి.. సూపర్ డూపర్ హిట్టు కొట్టారీయన. ఇక అదే ఫ్లోలో.. టాలీవులో కూడా.. హిట్ల మీద హిట్లు కొడుతూ.. స్టార్ హీరోగా మారిపోయారు. కానీ తన జీవితంలోకి కాస్త ఆలస్యంగా వచ్చిన లక్కు.. మరో సారి తనకు ఫేవర్‌ చేయకుండా హ్యాండివ్వడంతో.. ఓ క్రేజీ సినిమాను మిస్‌ చేసుకున్నారు నవీన్ పొలిశెట్టి. ఎస్ ! రీసెంట్‌గా మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హిట్టుకొట్టిన నవీన్‌ పొలిశెట్టి.. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీకి ఫస్ట్ ఛాయిస్ అట. ఈ సినిమాలోని ఎస్‌ జే సూర్య యాక్ట్ చేసిన రోల్‌కు,.. మొదట ఎస్ జే సూర్య ఒప్పుకోకపోవడంతో… నవీన్‌నే అప్రోచ్‌ అయ్యారట డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. ఇక స్టోరీ విన్న పొలిశెట్టి.. ఆ క్యారెక్టర్ నచ్చడంతో.. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌కు ఓకే చెప్పారట. సినిమా చేయడం పై విపరీతమైన ఇంట్రెస్ట్ చూపించారట. అయితే మనసు మార్చుకున్న ఎస్ జే సూర్య.. తిరిగి జిగర్‌ తాండ చేసేందుకు ఒప్పుకోవడంతో… చేసేదేం లేక డైరెక్టర్ సూర్య వైపే మొగ్గు చూపారట. సూర్యనే ఫైనల్ చేసి.. షూటింట్ కంప్లీట్ చేశారట. ఇలా ఈ స్టార్ హీరో.. తన బ్యాడ్‌ లక్‌తో.. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను మిస్‌ చేసుకున్నారు. తమిళ్లో ఎంట్రీ ఇచ్చే బంపర్ ఆఫర్‌ను చేజార్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..