Varudu Kavalenu: యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిందిచిత్రయూనిట్. ఇటీవలే ప్రీరిలీజ్ ఈవెంట్ తోపాటు సంగీత్ ఈవెంట్ అంటూ హడావిడి చేస్తుంది టీమ్. తాజాగా ఈ సినిమా గురించి హీరో శౌర్య మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2018లో ‘చలో’ సక్సెస్ పార్టీలో ఎడిటర్ చంటిగారి ద్వారా లక్ష్మీ సౌజన్య పరిచయమయ్యారు. ‘చలో’ సినిమా నచ్చి నన్ను అభినందించి, ఓ కథ చెబుతా వింటావా అన్నారు. సరే అని విన్నాను. అప్పుడు మొదలైన జర్నీ ఇప్పటి వరకూ కొనసాగుతుంది. ఫైనల్‌గా సినిమా విడుదలకు వచ్చింది, మా అక్క కల నిజమయ్యే రోజు వచ్చింది అన్నారు శౌర్య .
ప్రతి ఇంట్లో చూసే కథే ఈ సినిమా అన్నారు శౌర్య. 30 ఏళ్లు దాటిన అబ్బాయి, అమ్మాయిలను పెళ్లి ఎప్పుడు? సంబంధాలు చూడాలా? అని అడగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి ఎంత వరకూ రెడీగా ఉన్నారు అన్నది ఆలోచించరు. ఇలాంటివి అన్నీ మనం వింటుంటాం. ఈ పాయింట్ జనాలకు బాగా రీచ్ అవుతుందని ఈ సినిమాను అంగీకరించా. ఇది పక్కా యంగ్‌స్టర్స్ కథ. మెచ్యుర్డ్ లవ్‌స్టోరీ. ఇందులో రెండు ప్రేమకథలుంటాయి. పెళ్లి పీటల ముందు వరకూ జరిగే కథ ఇది. ఆడవాళ్ల ఓపిక, ప్రేమను ఒప్పించేంత వరకూ వెయిట్ చేసే ప్రేమ కథ ఇది అన్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌గారు ఓ సీన్ రాశారు. ఆ సీన్‌లో నేను యాక్ట్ చేశా. డైలాగ్‌లు చెప్పా. ఇందులో 15 నిమిషాల క్లైమాక్స్ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నివేశాలను అందరూ ఫ్రెష్‌గా ఫీలవుతారు. ‘అత్తారింటికి దారేది’లో నదియాగారు పోషించిన పాత్ర చూసి ఆమెతో ఈ తరహా పాత్ర చేయించడం కరెక్టేనా అనిపించింది. అయితే షూట్‌లో ఆమె అభినయం చూసి ఆ పాత్రతో ప్రేమలో పడిపోయా. అంత వేరియేషన్ ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చారు శౌర్య.
గతంలో నేను నందినీ రెడ్డిగారితో పని చేశా. అమ్మాయి డైరెక్టర్ అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్లకి కోపం త్వరగా రాదు. ఓపిక ఎక్కువ. దేనికీ త్వరగా రియాక్ట్ కారు.. ఎప్పుడు రియాక్ట్ కావాలో అప్పుడే రియాక్ట్ అవుతారు. అన్ని పనులు సమకూర్చుతారు. మేల్ డైరెక్టర్స్‌తో పని చేయడంలో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నారు శౌర్య.
మరిన్ని ఇక్కడ చదవండి :