Kiran Abbavaram: కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం మూవీ ఫస్ట్ లుక్..

|

Apr 10, 2022 | 12:47 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) స్పీడ్ పెంచాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టలతో దూసుకుపోతున్నాడు.

Kiran Abbavaram: కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం మూవీ ఫస్ట్ లుక్..
Kiran Abbavaram
Follow us on

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) స్పీడ్ పెంచాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే సెబాస్టియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. యంగ్ హ్యాపెనింగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు జోడీగా క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రానికి వినరో భాగ్యము విష్ణుకథ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురూ ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో జరుగుతుంది. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి కానుంది. ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నాయి. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్‏లో అందరిని అలరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

Also Read: NTR Jr.-Koratala Shiva: తారక్ సినిమాపై క్రేజీ అప్డేట్.. కొరటాల.. ఎన్టీఆర్ మూవీ డేట్ ఫిక్స్ ?..

Viral Photo: ప్రకృతి అందాల నడుమ అందాల రాశి.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

Pakka Commercial: ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. పక్కా కమర్షియల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..