Kiran Abbavaram : మా కథే తీశారని, మా లైఫ్‌లో కూడా ఇలా జరిగిందని అంటున్నారు.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ టాలెంటెడ్ కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సమ్మతమే (Sammathame).

Kiran Abbavaram : మా కథే తీశారని, మా లైఫ్‌లో కూడా ఇలా జరిగిందని అంటున్నారు.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Kiran Abbavaram

Updated on: Jun 26, 2022 | 6:42 PM

టాలీవుడ్ టాలెంటెడ్ కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram )ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సమ్మతమే (Sammathame). ఈ చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడిచేసింది. ఈ సినిమాను జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి హౌస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..

సమ్మతమే చూసిన ప్రేక్షకులు మా కథే తీశారని, మా లైఫ్ లో కూడా ఇలా జరిగిందని అభినందించడం ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ కథని ఎంత బలంగా నమ్మారో అంత బలంగా తీశారు. ఈ రోజు సినిమా అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. అయితే ఈవింగ్ షో తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అని తేలింది. సమ్మతమేకి కూడా అదే జరిగింది. మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్యూలు కొన్ని వినిపించాయి. ఈవినింగ్ సంధ్య థియేటర్ కి వెళ్లి చూస్తే మొత్తం హౌస్ ఫుల్. ప్రేక్షకులంతా విజల్స్ వేస్తూ ఒక మాస్ సినిమాని చూస్తున్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి డైలాగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ పాటు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేశామని చెప్పడం మరింత ఆనందంగా వుంది. థియేటర్ కి వచ్చి సమ్మతమే చిత్రం చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కృతజ్ఞతలు. ప్రేక్షకుల వలనే సమ్మతమే పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్, బన్నీ వాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమాని గొప్పగా విడుదల చేశారు. మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. థియేటర్ల సంఖ్య పెరుగుతున్నాయి. యూస్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిపీట్ ఆడియన్స్ వెళ్తున్నారు. రెస్పాన్స్, కలెక్షన్స్ అద్భుతంగా వున్నాయి. యూస్ ఆడియన్స్ కి థాంక్స్. దర్శకుడు గోపీనాథ్, ప్రవీణ అమ్మ, చాందిని, మిగతా టీం అందరికి థాంక్స్. ముఖ్యంగా యుజీ టీం కి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సమ్మతమే చిత్రాన్ని అందరూ మన సినిమాగా ఆదరించారు. ఇంకా చూడని వాళ్ళు థియేటర్ కి వెళ్లి చూడండి. థియేటర్ ఎక్సపిరియన్స్ మిస్ కావద్దు” అని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి