Selfish Movie: మరో ప్రాజెక్ట్‏ను స్టార్ట్ చేసిన యంగ్ హీరో.. సెల్ఫిష్ మూవీ గ్రాండ్ ఓపెనింగ్..

|

Apr 15, 2022 | 11:14 AM

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజ్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అశిష్ రెడ్డి (Ashish Reddy). రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా తెలుగు

Selfish Movie: మరో ప్రాజెక్ట్‏ను స్టార్ట్ చేసిన యంగ్ హీరో.. సెల్ఫిష్ మూవీ గ్రాండ్ ఓపెనింగ్..
Selfish
Follow us on

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజ్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అశిష్ రెడ్డి (Ashish Reddy). రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ యంగ్ హీరో మరో కొత్త ప్రాజెక్ట్‏ను అనౌన్స్ చేశాడు. సెల్ఫిష్ అనే టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‏లో అశిష్ సరికొత్త లుక్‏లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి కాశీ విశాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ మూవీకి క్లాస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈరోజు ఉదయం ఈ సినిమాను పూజా కార్యాక్రమాలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు హీరో ధనుష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సెల్ఫిష్ సినిమా పూజా కార్యక్రమాలను టీవీ9 తెలుగులో లైవ్‏లో వీక్షించండి.

Also Read: suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..

Simbu: ఆటో డ్రైవర్‏గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..

PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు.. 

Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్‏కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..