ఓ యువ గాయని పాటకు ఫిదా అయ్యారు శంకర్ మహదేవన్. సూర్య గాయత్రి అనే అమ్మాయి పాడిన పాటను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఈ సింగర్ కమ్ మ్యూజిషిన్… సోల్ టచింగ్ టాలెంట్ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఈ చిన్నారి తన కంపోజిషన్‌కు 200 పర్సెంట్ న్యాయం చేసిందంటూ ఆకాశానికెత్తేశారు శంకర్ మహదేవన్. కర్ణాటిక్ వోకలిస్ట్ కుల్దీప్ ఎమ్ పాయ్ కంపొజిషన్స్‌తో చిన్న వయసులో అందరి దృష్టిని ఆకర్షించారు సూర్య గాయత్రి. సంగీత కుటుంబం నుంచి వచ్చిన ఈ చిన్నారి వందలాది స్టేజ్ షోస్ చేయటంతో పాటు యూట్యూబ్ వీడియోస్‌లోనూ కనిపించారు. యూట్యూబ్‌లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయంటేనే ఆమె పాటలకు ఏ రేంజ్‌లో ఆడియన్స్ ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
సూర్య గాయత్రిని మాత్రమే కాదు రీసెంట్‌గా ఆదిత్య సురేష్ అనే మరో సింగర్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు శంకర్ మహదేవన్.. ఏఆర్ రెహమాన్ పాడిన పాటను ఈ పిల్లాడు ఎంత పర్ఫెక్ట్‌గా పాడుతున్నాడో చూడండి… అంటూ ఓ వీడియో షేర్ చేశారు. మరి శంకర్ మహదేవన్ సపోర్ట్ ఈ చిన్నారులకు సినిమా అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.
Also Read: ట్రెండ్స్ విషయంలో ఊచకోత పక్కా అంటున్న మహేష్ ఫ్యాన్స్.. మాములు ప్లానింగ్ కాదుగా
పళ్ళు పసుపు రంగులోకి మారాయా..? ఈ టిప్స్ పాటిస్తే మిలమిల మెరవడం ఖాయం..