Year Ender 2025: గూగుల్ దుమ్ముదులిపారు.. 2025లో ఎక్కువ మంది సర్చ్ చేసిన సినిమాలు ఇవే..

2025కు త్వరలోనే గుడ్ బై చెప్పనున్నాం. ఇక ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో చాలా సంఘటనలు జరిగాయి. ఊహించని విధంగా కొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇంకొంతమంది విడాకులు తీసుకున్నారు. ఇంకొంతమంది ప్రేమలో పడ్డారు. అదేవిధంగా మరికొంతమంది భామలు స్టార్ డమ్ కూడా తెచ్చుకున్నారు.

Year Ender 2025: గూగుల్ దుమ్ముదులిపారు.. 2025లో ఎక్కువ మంది సర్చ్ చేసిన సినిమాలు ఇవే..
Year Ender 2025

Updated on: Dec 08, 2025 | 2:07 PM

మరికొద్ది రోజుల్లో 2025కు గుడ్ బై చెప్పనున్నాం.. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ సిద్ధమయ్యారు. కాగా ఈ ఏడాది చాలా వింతలు విశేషాలు జరిగాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో.. కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలాగే మరికొంతమంది విడిపోయారు. ఇక మరికొందరు లెజెండ్స్ కన్నుమూశారు. అదేవిధంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విడుదలై సంచలన విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి కూడా.. ఇక ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సర్చ్ చేసిన సినిమాలు ఏవో తెలుసా.? లో చూడటమే కాదు ఎక్కువగా మంది ఆ సినిమాల గురించి గూగుల్ లో గాలించారు. ఆ సినిమాలు ఏంటంటే..

 కాంతార చాప్టర్ 1

రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 800కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను నెటిజన్స్ ఎక్కువగా 2025లో గూగుల్ లో గాలించారు.

కూలీ…

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు. నెగిటివ్ రోల్ లో నాగ్ అదరగొట్టారు. అలాగే ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాను కూడా నెటిజన్స్ గూగుల్ ల్లో ఎక్కువ మంది గాలించారు.

ఇవి కూడా చదవండి

వార్ 2..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2, హృతిక్ రోషన్ తో కలిసి తారక్ నటించిన ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఆగస్టు 14న విడుదలైన వార్ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తారక్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా ఎక్కువమంది గూగుల్ లో సర్చ్ చేశారు.

మహావతార్ నరసింహ..

ఈ ఏడాది విడుదలైన భారీ హిట్ సినిమాల్లో మహావతార్ సినిమా ఒకటి. ఈ యానిమేటడ్ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోపాటు  సనమ్ తేరీ కసమ్, సైయారా, మార్కో,  గేమ్ చేంజర్  సినిమాలను ఎక్కువమంది గూగుల్ లో సర్చ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి