
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు. హీరో యశ్ సరసన కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా జత కట్టింది. అలాగే నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి అందాల తారలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ సహా పలువురు విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సినిమా మొత్తం రక్తపాతంతో నిండిపోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
ఇక టాక్సిక్ సినిమా కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ఈ నెల 21 నుంచి టికెట్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. దాంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టాక్సిక్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు షాకింగ్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 18+ (అడల్ట్స్ ఓన్లీ ) సర్టిఫికేట్‌ను కేటాయించింది. హింస, రక్తపాతం, శృంగార దృశ్యాలు ఉన్నాయని యూకే సెన్సార్ బోర్డు తెలిపింది. ఇక ఈ సినిమా యాక్షన్ సీన్స్ ఒకెత్తు అయితే యష్ నటన మరో ఎత్తు.. అతను అద్భుతంగా నటించాడు అంటూ సెన్సార్ బోర్డు తెలిపింది.
గోవాలో రౌడీ ముఠా సామ్రాజ్యాన్ని ఏలే ఒక పవర్ ఫుల్ డ్రగ్ కార్టెల్ లీడర్, తన సొంత నాశనానికి తానే ఎలా బీజం వేసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ట్రైలర్ లో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. అయితే ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉందని సెన్సార్ బోర్డు తెలిపింది. అయితే హాయ్ ఓల్టేజ్ యాక్షన్ సినిమా కావడంతో సినిమాలోని యాక్షన్ సీన్స్, రక్తపాతం కు 5/5 రేటింగ్ ఇచ్చిందని. అలాగే డైలాగ్స్, డ్రగ్స్ వినియోగం, లైంగిక హింస, శృంగారం ఇలాంటి కేటగిరీలలో 4/5 రేటింగ్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇక టాక్సిక్ సినిమా రన్ టైం విషయానికొస్తే సినిమా మొత్తం 192 నిమిషాలుగా ఫిక్స్ చేస్తూ యూకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే 3 గంటల 12 నిముషాలు సినిమా ఉండనుంది.
ఇది కూడా చదవండి :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.