Yash: రాకీభాయ్ గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

|

Sep 30, 2022 | 9:59 AM

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఒకే ఒక్క సినిమాతో అన్ని భాషల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అదే కేజీఎఫ్. ఈ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు యష్.

Yash: రాకీభాయ్ గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
Yash
Follow us on

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఒకే ఒక్క సినిమాతో అన్ని భాషల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అదే కేజీఎఫ్. ఈ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ సూపర్ హిట్ కాగా.. సెకండ్ పార్ట్ అంతకు మించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  సౌత్ టూ నార్త్ అన్ని రికార్డులకు కొల్లగొడుతూ దూసుకుపోయింది.

ఇక ఇప్పటికే ఉన్న రికార్డులను టచ్ చేయడంలో.. నయా రికార్డులను సెట్ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు కేజీఎఫ్ చాప్టర్ 2 ఫిల్మ్ (KGF 2). రిలీజైన దగ్గరి నుంచి క్లోజింగ్ కలెక్షన్స్‌ తో థియేటర్‌ను షేక్ చేసిన ఈ ఫిల్మ్… ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ముందు హైహెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటికిగా హిస్టరీ కెక్కింది. ఆ తరువాత ఓటీటీలోనూ స్ట్రీమవుతూ.. నిన్న మొన్నటి వరకు టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ సమయం గడుపుతున్నాడు. అదే సమయంలో యశ్ తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. తాజాగా యష్  కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

గన్ తో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ క్రేజీ హీరో. ఇందులో యష్ గన్ తో షూట్ చేస్తూ కనిపించాడు. అయితే ఇక్కడ ‘జాన్ విక్ 2’ వంటి పలు చిత్రాలకు పని చేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జె.జె. పెర్రీ పర్యవేక్షణలో యష్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. ఇక ఈ వీడియోకు “లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎల్లప్పుడూ ఒక దారి ఉంటుంది.. దానిని గుర్తించడమే ఛాలెంజ్. వాట్ ఏ ఫెంటాస్టిక్ డే. థాంక్యూ మై మ్యాన్ జే జే పెర్రీ. నెక్స్ట్ టైం అది కలాష్నికోవ్ (కేజీఎఫ్ సినిమాలోని గన్ పేరు ) అయి ఉండాలి” అని తసుకొచ్చాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.