జులై16… ముందనుకున్న లెక్క ప్రకారం కేజీఎఫ్ సెకండ్ చాప్టర్ ఈ డేట్‌కే రిలీజ్ కావాల్సింది. కొత్త డేట్ పై కసరత్తు జరుగుతోంది. ట్రిపులార్ రిలీజ్ డేట్ కూడా లాక్ అవడంతో.. కేజీఎఫ్ మేకర్స్ మీద ఒత్తిడి పెరిగింది. రాకీ భాయ్ ఎప్పుడొచ్చే ఛాన్సుందో తెలుసుకుందాం పదండి. అడుగడుగునా పంచ్ డైలాగ్స్… అంతకు మించి యాక్షన్ సీక్వెన్స్… హీరో ఎలివేషన్స్… కేజీఎఫ్‌ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో వైరల్ చేశాయి. మళ్లీ అంతకు మించి రేంజ్‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు కేజీయఫ్ లవర్స్… ఆ నెవర్ బిఫోర్ ఎలివేషన్‌ని ప్రశాంత్ నీల్ ఎప్పుడు చూపిస్తారు అన్నది ఇప్పుడు మెయిన్ ప్రశ్నగా మారింది. సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, సంక్రాంతి… ఇలా ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. ‘ది మాన్‌స్టర్ విల్ ఒన్లీ అరైవ్ వెన్ ద హాల్ ఈజ్ ఫిల్డ్ విత్ గ్యాంగ్‌స్టర్స్’.… అని థియేటర్లు సంపూర్ణంగా ఓపెన్ అయినప్పుడే వస్తాం అని ఓపెన్‌గానే చెప్పేశారు మేకర్స్.
ఆగస్టుకి అన్ని చోట్లా థియేటర్లు జనాలతో కళకళలాడుతాయన్నది ట్రేడ్ పండిట్స్ అంచనా. జనాలు థియేటర్లకు కాస్త అలవాటు పడేవరకు ఆగినా…కేజీయఫ్2కి సెప్టెంబర్ బెస్ట్ రిలీజ్ టైమ్ అన్నది క్రిటిక్స్ మాట. ఆలస్యం చేస్తే అక్టోబర్‌లో ట్రిపుల్ ఆర్ పోటీకి రెడీగా ఉంటుంది. కేజీయఫ్ కథ అందరికీ తెలిసిందే. అదే ట్రిపుల్ ఆర్ కోసం వరల్డ్ వైడ్ వెయిటింగ్. సో ఆ మేనియా ముందు ఎంత ఎలివేషన్ అయినా అంతగా కన్విన్స్ చేయలేదేమో అనే అనుమానాలూ లేకపోలేదు. అందుకే ప్రీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయితే బెస్ట్ అనే మాట మార్కెట్ అనలిస్టుల నుంచి కూడా వినిపిస్తోంది. ఇంతకీ హొంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ల మనసులో ఏముందన్నది తెలియాలి. వాళ్ల సంగతేమో గానీ, టీజర్ 200 మిలియన్ల రీచింగ్ గురించి మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు.
Also Read: పాపం ఈ పెద్దాయన ఆపరేషన్ కోసం దాచుకున్న 2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి