Yash: పుట్టిన రోజు వేడుకలో విషాదం.. గాయపడిన అభిమానుల కుటుంబాలకూ యశ్‌ ఆర్థిక సాయం.. ఒక్కొక్కొరికి..

గత నెలలో కేజీఎఫ్‌ హీరో యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా అతని కటౌట్‌ ఏర్పాటు చేసే క్రమంలో పెను విషాదం చోటు చేసుకుంది. యశ్ పుట్టినరోజుకి ఒకరోజు ముందు, అంటే జనవరి 7న హీరో బర్త్ డే బ్యానర్ ఏర్పాటు చేయడానికి వెళ్లిన ముగ్గురూ ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డారు.

Yash: పుట్టిన రోజు వేడుకలో విషాదం.. గాయపడిన అభిమానుల కుటుంబాలకూ యశ్‌ ఆర్థిక సాయం.. ఒక్కొక్కొరికి..
Hero Yash

Updated on: Feb 03, 2024 | 5:40 PM

గత నెలలో కేజీఎఫ్‌ హీరో యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా అతని కటౌట్‌ ఏర్పాటు చేసే క్రమంలో పెను విషాదం చోటు చేసుకుంది. యశ్ పుట్టినరోజుకి ఒకరోజు ముందు, అంటే జనవరి 7న హీరో బర్త్ డే బ్యానర్ ఏర్పాటు చేయడానికి వెళ్లిన ముగ్గురూ ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డారు. విద్యుదాఘాతంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న హీరో యశ్‌ వెంటనే మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించాడు. ఇప్పుడు గాయ పడిన కుటుంబాలకు కూడా అండగా నిలిచాడు. తాజాగా క్షతగాత్రుల డు యశ్ ధన్ కూడా గాయపడిన కుటుంబానికి సహాయం చేశాడు. గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ తాలూకా సురంగి గ్రామంలో జనవరి 7న యశ్‌ కటౌట్‌ ఏర్పాటు చేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలింది. కటౌట్‌కు విద్యుత్ వైరు తగలడంతో హనుమంత హరిజన్, మురళీ పంతిమణి, నవీన్ గాజీ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మంజునాథ్, ప్రకాష్, హనుమంత, నాగరాజ్‌లు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే వీరి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు యశ్‌. ఈ విషయాన్ని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

ప్రమాదం జరిగిన వెంటనే యష్ స్వయంగా సురంగి గ్రామాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జనవరి 17న మరణించిన యువకుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున యశ్ ఆర్థిక సహాయం అందజేశాడు. ఇదే సమయంలో క్షతగాత్రుల బ్యాంకు వివరాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వారి ఖాతాల్లో ఒక్కొక్కిరికి లక్ష రూపాయలు జమ చేశారు. అభిమానుల కోసం యష్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

 

మృతుల కుటుంబాలను పరామర్శిస్తోన్న యశ్..

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.