Vijayendra Prasad: ‘అప్పుడు ప్రధాని మోదీ.. ఇప్పుడు స్పీల్ బర్గ్ ఒకేమాట చెప్పారు’.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్..

నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో తనతో ప్రధాన మంత్రి మోదీని చెప్పిన మాటనే.. ఇటీవల స్పీల్ బర్గ్ సైతం రాజమౌళితో చెప్పారని అన్నారు.

Vijayendra Prasad: అప్పుడు ప్రధాని మోదీ.. ఇప్పుడు స్పీల్ బర్గ్ ఒకేమాట చెప్పారు.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్..
Vijayendra Prasad

Updated on: Mar 16, 2023 | 8:04 AM

ఆర్ఆర్ఆర్ సినిమాతో మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ రాజమౌళి. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకు వరల్డ్ వైడ్‏గా సెన్సెషన్ క్రియేట్ చేసింది. అంతర్జా్తీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ అందుకుని.. ఇప్పుడు నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకుని భారత సినిమా కీర్తిని పెంచేశారు. ట్రిపుల్ ఆర్ టీం ఆ అవార్డ్ అందుకున్న తర్వాత ఆ సినిమా రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో తనతో ప్రధాన మంత్రి మోదీని చెప్పిన మాటనే.. ఇటీవల స్పీల్ బర్గ్ సైతం రాజమౌళితో చెప్పారని అన్నారు.

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “నేను కొంతకాలం క్రితం ప్రధాని మోదీని కలిశాను. నాలుగు నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నాను.. కానీ మా మీటింగ్ 40 నిమిషాలు సాగింది. ఆ నలభై నిమిషాలు ప్రపంచం మొత్తం భారత్ వైపు ఎలా చూడాలనే విషయం గురించి చర్చించుకున్నాం. మోదీ విజన్‏కు నేను ఆశ్చర్యపోయాను. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని..దానిని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలి.’ అని ప్రదాని మోదీ అన్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల డైరెక్టర్ రాజమౌళిని కలిసిన స్పీల్ బర్గ్ ఆయన కూడా అదే మాట చెప్పినట్లు తెలిపారు. భారతదేశ సంస్కృతి ఉట్టిపడేలా సినిమాలను తీయాలని జక్కన్నకు స్పీల్ బర్గ్ సూచించినట్లుగా తెలిపారు. ఇక ఆర్ఆర్ఆర్ సక్సెస్ వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్టన్లు తెలిపారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాసేందుకు తన సోదరుడు శివ శక్తి దత్తా స్క్రిప్ట్ రాయడానికి సాయం చేస్తే.. రాజమౌళి చిత్రానికి దర్శకత్వం వహించారని అన్నారు. ఇక రాజమౌళి భార్య, కీరవాణి, కాలభైరవ.. ఇలా ఎంతో మంది ఉమ్మడి కృషి ఫలితంగా చిత్రం ఇంత పెద్ద విజయం సాధించిందని ఆయన చెప్పారు. ప్రపంచవేదికపై ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం.. తాజాగా సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.