Writer Padmabhushan: రైటర్ పద్మభూషణ్ నవ్వులు పంచేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడు.. ఎక్కడంటే..?
Writer Padmabhushan OTT Release Date: రైటర్ పద్మభూషణ్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నది. రిలీజ్ డేట్‌ను వినూత్నంగా హీరోహీరోయిన్లు సుహాస్, టీనా శిల్పరాజ్ బుధవారం అనౌన్స్ చేశారు.

‘రైటర్ పద్మభూషణ్’.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 3న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. విమర్శకులు ప్రశంసలు సైతం దక్కాయి. సుహాస్ సరసన టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా నటించింది. ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ ఓటీటీ రైట్ జీ5 దక్కించుకుంది. మార్చి 17వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన వచ్చేసింది. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించారు. సినిమాలో సుహాస్ తల్లిదండ్రులుగా ఆశీష్ విద్యార్థి, రోహిణి నటించారు.
#WriterPadmaBhushan on March 17th on @ZEE5Telugu pic.twitter.com/sZNxrgsD64
— R a J i V (@RajivAluri) March 8, 2023
రచయిత కావాలని ఆరాటపడే పద్మభూషణ్ అనే యువకుడిగా సుహాస్ నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి అడుగు పేరుతో ఓన్‌గా ఓ బుక్ రాస్తాడు పద్మభూషణ్. కానీ ఆ బుక్ సక్సెస్ కాదు. అదే టైమ్‌లో అతడి పేరుతో మరో పుస్తకం విడుదలై విజయవంతమవుతుంది. అతడి పేరుతో ఏర్పాటైన బ్లాగ్‌కు కూడా జనాల్లో మంచి పాపులారిటీ వస్తుంది. మరదలితో వివాహంతో పాటు నేమ్ అండ్ ఫేమ్ కోసం ఆ పుస్తకాన్ని రాసింది తానే అని అబద్ధం చెప్పుకు తిరుగుతాడు పద్మభూషణ్. ఆ అబద్ధం కారణంగా అతడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నాడు అనే సందర్భాలను వినోదాత్మక పంథాలో షణ్ముఖ్ ప్రశాంత్ ఈ సినిమాలో ఆవిష్కరించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




