AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆయన గొప్ప వ్యక్తి.. సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు డబ్బులిచ్చి ఇంకో ఛాన్స్ ఇచ్చిన ఏకైక హీరో..

తెలుగు సినీ చరిత్రలో ఆయన గొప్ప వ్యక్తి. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. కేవలం హీరోగానే కాకుండా, రంగుల చిత్రాలు, సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి అనేక ఆధునిక హంగులను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ధైర్యానికి, సాహసానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆయన, దర్శకులు, సినిమాటోగ్రాఫర్‌లు వంటి ఎందరో కొత్త టెక్నీషియన్లను ప్రోత్సహించి పరిశ్రమ విస్తరణకు కృషి చేశారు.

Tollywood : ఆయన గొప్ప వ్యక్తి.. సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు డబ్బులిచ్చి ఇంకో ఛాన్స్ ఇచ్చిన ఏకైక హీరో..
Krishna
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2026 | 7:42 AM

Share

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి. ఆయన పేరు వినగానే తెలుగు వారి హృదయాలు పులకించిపోతాయి. తెలుగు సినిమాకు కొత్త రంగులు, హంగులు, ఆధునికతను అద్దిన ఘనత కృష్ణదే. కలర్ పిక్చర్, సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలను తొలుత పరిచయం చేయడమే కాకుండా, కౌబాయ్, సింహాసనం వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. సమాజంలో తనకి నచ్చని ప్రతీ అంశాన్ని ధైర్యంగా ప్రశ్నించిన కృష్ణ, సాహసానికి, నిర్భయత్వానికి మారుపేరుగా నిలిచారు. సీనియర్ కో-డైరెక్టర్ కనగల జయకుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కృష్ణ కెరీర్, సినీ ప్రయాణం, సవాళ్లు, మంచితనం గురించి చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, కృష్ణ కేవలం నటుడిగానే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమ విస్తరణకు అనూహ్యమైన కృషి చేశారు. ఎందరో దర్శకులు, సినిమాటోగ్రాఫర్‌లను ప్రోత్సహించి, వారికి అవకాశాలు కల్పించారు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉండేవి. ఇతర అగ్ర నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లతో పోటీపడి సినిమాలు తీసినా, వారితో కలిసి “దేవుడు చేసిన మనుషులు” వంటి చిత్రాలలో నటించి తన విశాల దృక్పథాన్ని చాటుకున్నారు. నాగేశ్వరరావుతో “దేవదాసు”కి పోటీగా మరో “దేవదాసు” నిర్మించి, ఆ తర్వాత మళ్లీ వారితో కలిసి సినిమాలు చేయడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

కృష్ణ తన ఎదుగుదలకే కాకుండా, తన చుట్టూ ఉన్న వ్యక్తులని, ముఖ్యంగా నిర్మాతలను ప్రోత్సహించారు. నిర్మాతను “దేవుడు”గా భావించి, ఆయనను “ఇండస్ట్రీకి ఒక చెట్టు”తో పోల్చారు. ఆ చెట్టు నీడనే ఇండస్ట్రీ బతుకుతుందని ప్రగాఢంగా విశ్వసించారు. ఒక సందర్భంలో, ఒక నిర్మాత సినిమా ప్లాప్ అయిన తర్వాత కనిపించకుండా పోతే, కృష్ణ స్వయంగా డబ్బులు పెట్టి, ఆ నిర్మాతతో మరో సినిమా తీయించి ఆయన్ను నిలబెట్టారు. ఈ సంఘటన ఆయన దాతృత్వానికి, నిస్వార్థ సేవకు చక్కటి ఉదాహరణ. నిర్మలమైన మనస్తత్వానికి ప్రతీకగా, ఆయన కళాశాల రోజుల్లో ఏలూరులో చదువుకుంటున్నప్పుడు విద్యార్థులు ఆయన్ను “దేవుడు” అని పిలిచేవారట. మురళీమోహన్ వంటి సహ విద్యార్థులు సైతం ఆయన నిరాడంబరతను, మర్యాదపై ప్రశంసలు కురిపించారు. పరిశ్రమలోనూ అదే పేరు సార్థకమైంది. శోభన్ బాబు ఒప్పుకోని “నేరము శిక్ష” సినిమాను నిర్మాత బాలి అడగ్గానే, కృష్ణ వెంటనే ఒప్పుకుని ఆయనకు అండగా నిలిచారు. ఇలా ఎందరో నిర్మాతలు, దర్శకులు, కెమెరామెన్లు కృష్ణ సహకారంతో నిలదొక్కుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

సూపర్ స్టార్ కృష్ణ ఫోటో..

Krishna News

Krishna News

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us
సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు డబ్బులిచ్చి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు..
సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు డబ్బులిచ్చి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు..
కోహ్లీ బౌలర్‌కు ఇచ్చిపడేసిన గిల్ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
కోహ్లీ బౌలర్‌కు ఇచ్చిపడేసిన గిల్ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్