Priya Prakash Varrier: ఓవర్ నైట్ లో స్టార్ అయ్యిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఆ ఫేమ్ ను కాపాడుకుంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా మలుచుకుంటున్న వారు కొందరు ఉన్నారు. వారిలో ఈ అందాల భామ కూడా ఒకరు. ఒక్కసారి కన్ను గీటి కుర్రాళ్ళ మనస్సులో స్థానం సంపాధించుకుంది వయ్యారి భామ ప్రియా ప్రకాష్ వారియర్. మళయాలంలో తెరకెక్కిన ఒరు అదార్ లవ్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. అదే సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో ప్రియా ప్రకాష్ కన్ను గీటుతుంది. ఆ సీన్ అప్పట్లో ఓ ఊపు ఊపింది. కుర్రాలంతా ఆ సీన్ కు ఫిదా అవ్వడమే కాదు సోషల్ మీడియాను కూడా షేక్ చేశారు. అయితే తాజాగా ఓ ఇంట్రవ్యూలో ప్రియా ప్రకాష్ మాట్లాడుతూ.. ఆ సీన్ గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది.
ప్రియా ప్రకాష్ మాట్లాడుతూ.. కన్నుగీటే సీన్ నాకు చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ ఒక్క సీన్ తో నాకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది అంది. ఆ సినిమా చేస్తున్న సమయంలో తనకు కేవలం 18 సంవత్సరాలే అని తెలిపింది ప్రియా ప్రకాష్. అయితే ఆ సీన్ తో ఎంత క్రేజ్ వచ్చిందో.. అంతే నెగిటివిటి కూడా వచ్చింది అన్నారు. చాలా మంది ఆ సీన్ ను రకరకాలుగా వాడుకొని నన్ను ట్రోల్ చేశారు. ఆసమయంలో నా పై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ నన్ను చాలా భాదపెట్టాయి. అంతే కాదు ఆ సీన్ కారణంగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి అని చెప్పుకొచ్చింది ప్రియా. ఇక ప్రియా ప్రకాష్ సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు పలు మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా.. తన గ్లామర్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత తేజ సజ్జ తో కలిసి ఓ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముడుగుమ్మ రకరకాల ఫొటోలతో మతిపోగొడుతోంది.