Mokshagna : బాలయ్య వారసుడికి హీరోయిన్‌గా చేసేది ఆమేనా..?
బాలకృష్ణ కోస్టార్ అయినా చిరంజీవి, నాగార్జున వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో బాలయ్య వారసుడి ఎంట్రీ పై ఆసక్తి నెలకొంది. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది

నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు బాలయ్య. అటు రాజకీయ నాయకుడిగా ఇటు సినీ నటుడిగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు నటసింహం. ఇదిలా ఉంటే ఆయన వారసుడి ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. బాలకృష్ణ కోస్టార్ అయినా చిరంజీవి, నాగార్జున వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో బాలయ్య వారసుడి ఎంట్రీ పై ఆసక్తి నెలకొంది. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ఆయన రీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో లుక్ లోకి వచ్చేసిన మోక్షజ్ఞను చూసి అభిమానులు సంబరపడుతున్నారు.
మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నారు. వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞకు జోడీగా నటించే మొదటి హీరోయిన్ గురించి ఇప్పుడు ఆస్కతికర చర్చ జరుగుతోంది. ఇక హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు.
ఆ భామ ఎవరో కాదు లేటెస్ట్ శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ.. ఇప్పటికే అరడజను కు పైగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న భగవంత్ కేసరి సినిమాలోనూ నటిస్తుంది. ఆమె నటన , ఎనర్జీ చూసిన బాలయ్య .. తన కొడుకు సినిమాకు ఈ అమ్మడు కరెక్ట్ గా సరిపోతుందని అనుకున్నారట. దాంతో మోక్షజ్ఞ మొదటి హీరోయిన్ శ్రీలీల అని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.




