Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లోకి కలకత్తా బ్యూటీ.. రచ్చ రచ్చే అంటున్న నెటిజన్స్..

బిగ్ బాస్ సీజన్ 9 కు సర్వం సిద్ధమైంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 9కి కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లోకి కలకత్తా బ్యూటీ.. రచ్చ రచ్చే అంటున్న నెటిజన్స్..
Bigg Boss 9

Updated on: Aug 12, 2025 | 9:18 AM

బిగ్ బాస్ సీజన్ 9కు సర్వం సిద్ధం అయ్యింది. గత సీజన్స్ తో పోల్చితే ఈసారి మరింత వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలుకానుంది. ఇప్పటికే 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు సీజన్ 9తో రెడీ అవుతుంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది కామం పీపుల్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారు.

ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..

ప్రతిసారి బిగ్ బాస్ గేమ్ షోలోకి సీరియల్ బ్యూటీలు చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది సీరియల్ నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక ఇప్పుడు ఓ అందాల భామ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ  దేబ్జానీ మోదక్. ఈ అమ్మడు టెలివిజన్ రంగంలో చాలా ఫెమస్.. బెంగాలీ, తమిళ, తెలుగు భాషల పలు సీరియల్స్ చేసి మెప్పించింది ఈ అమ్మడు.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

ఇక ఈ అందాల భామ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందని తెలుస్తుంది. తెలుగులో దేబ్జానీ మోదక్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో పాపులర్ అయ్యింది. దేబ్జానీ వయసు ప్రస్తుతం 29 ఏళ్ళు. దేబ్జానీ కోల్ కతాలో బెంగాలీ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నదానికి విపరీతమై ఫాలోయింగ్ ఉంది. మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఎలా సందడి చేస్తుందో చూడాలి. కాగా ఈసారి సామాన్యులను, సెలబ్రెటీలను కలిపి బిగ్ బాస్ లోకి పంపనున్నారు. గతంలో ఒకరు మాత్రమే కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి అడుగుపెట్టారు.. ఇప్పుడు ఎక్కువ మంది సామాన్యులు వెళ్ళే అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ ఎంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి.

ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి