Guntur Kaaram: గుంటూరు కారం క్రేజీ న్యూస్.. మహేష్ బాబు ఎంట్రీ సీన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఆ మూడో సినిమా ఇది. ఈ సినిమాను మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు గురూజీ. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రానుంది. దాంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

Guntur Kaaram: గుంటూరు కారం క్రేజీ న్యూస్.. మహేష్ బాబు ఎంట్రీ సీన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Gunturu Kaaram
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Nov 18, 2023 | 5:54 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా పై అటు అభిమానుల్లో, ఇటు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఆ మూడో సినిమా ఇది. ఈ సినిమాను మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు గురూజీ. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రానుంది. దాంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. అలాగే జగపతి బాబు నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. జనవరి 12న గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో ఈ సినిమా నుంచి క్రేజీ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. గతకొంతకాలంగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ గెస్ట్ రోల్ ఉండదని తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపిస్తోందని తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమాలో మహేష్ బాబు వాయిస్ వినిపించింది. అలాగే ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఎంట్రీ సీన్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపించనుందట. ఎంట్రీ సీన్ తో పాటు పలు కీలక సన్నివేశాల్లోపవన్ వాయిస్ వినిపిస్తుందని ప్రచారం జోరుగా జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలే ఈ సినిమానుంచి విడుదలైన ధమ్ మసాలా సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ