Jr NTR : వార్ సీక్వెల్ కంటే ముందే ఆ బాలీవుడ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.?

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. దేవర అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో తారక్ సినిమా చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించనున్నారు. ఈ విషయానికి సంబంధించి గతంలో హృతిక్ కూడా హింట్ ఇచ్చాడు.

Jr NTR : వార్ సీక్వెల్ కంటే ముందే ఆ బాలీవుడ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.?
Ntr

Updated on: Oct 03, 2023 | 9:28 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా చేయనున్నారు తారక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. దేవర అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో తారక్ సినిమా చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించనున్నారు. ఈ విషయానికి సంబంధించి గతంలో హృతిక్ కూడా హింట్ ఇచ్చాడు. దాంతో తారక్ బాలీవుడ్ లో సినిమా చేయడం కన్ఫర్మ్ అంటూ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాలనూ తారక్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ సినిమా  విడుదలకు సిద్ధంగా ఉంది. దీపావళికి సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ కనిపించింది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇందులో వాస్తవం లేదని అంటున్నారు కొందరు. యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ స్పై యూనివర్స్ సిద్ధంగా ఉంది. ‘టైగర్ జిందా హై’, ‘పఠాన్’, ‘వార్’, ‘టైగర్ 3’ వంటి సినిమాలు తెరకెక్కించింది యష్ రాజ్ ఫిలిమ్స్. అందుకే షారుఖ్ ఖాన్ ‘టైగర్ 3’లో ‘పఠాన్’గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అంతే కాదు ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమా కూడా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ‘టైగర్ 3’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారని చెప్పుకున్నారు. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని అంటున్నారు యష్ రాజ్ ఫింలిమ్స్. కేవలం వార్ సీక్వెల్ లో మాత్రమే ఎన్టీఆర్ నటిస్తున్నారని తెలుస్తోంది. వార్ సీక్వెల్ లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హృతిక్ రోషన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

.