మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan)ఇటీవలే జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాలు చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని అందుకోగా ఆచార్య సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ అలాగే అధికారి అనే మరో టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరు కలిసి వినయవిధేయ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే చరణ్ ఓ బాలీవుడ్ సినిమాలో నటించనుండని టాక్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ బాలీవుడ్ లో ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. జంజీర్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు చరణ్. అయితే ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాలో నటించనున్నాడని టాక్. అయితే ఫుల్ లెంగ్త్ హీరోగా కాదు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాలో చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా అన్నగా వెంకీ కనిపించనున్నాడట. అలాగే చరణ్ కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ కీలక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. మరి సల్మాన్ సినిమాలో చరణ్ నటిస్తున్నాడా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి