AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroine Kayadu Lohar: తెలుగులో క్రేజీ ఆఫర్ అందుకున్న డ్రాగన్ బ్యూటీ.. ఆ హీరోకు జోడీగా కయాదు లోహర్

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న సినిమా డ్రాగన్. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కయదు లోహర్ హీరోయిన్. ఈ సినిమాతోపాటు అటు హీరోయిన్ కయదు లోహర్ సైతం చాలా ఫేమస్ అయ్యింది.

Heroine Kayadu Lohar: తెలుగులో క్రేజీ ఆఫర్ అందుకున్న డ్రాగన్ బ్యూటీ.. ఆ హీరోకు జోడీగా కయాదు లోహర్
Kayadu Lohar
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2025 | 6:29 PM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న సినిమా డ్రాగన్. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కయాదు లోహర్ హీరోయిన్.  ఈ సినిమాతోపాటు అటు హీరోయిన్ కయాదు లోహర్ సైతం చాలా ఫేమస్ అయ్యింది. ఈ చిత్రంలో డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ నటించగా.. సెకండ్ హీరోయిన్ గా కయాదు లోహర్ ఎంట్రీ అదిరిపోతుంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో కయాదు లోహర్ అడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. సినిమాలో అమ్మడి లుక్స్, యాక్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది. అమ్మడి ఫీచర్స్ చూసిన ఎవరైనా సరే స్టార్ మెటీరియల్ అనేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది తెలుగులోకి అడుగుపెట్టనుందని తెలుస్తుంది. గతంలో ఓ తెలుగు సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమా చేసి అలరించనుంది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా  ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. విశ్వక్ సేన్, దర్శకుడు అనుదీప్ కె.వి కాంబోలో రాబోతున్న సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా ఎంపికైందని టాక్ వినిపిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఫంకీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఇటీవల, కయాదు లోహర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తెలుగులో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసింది. అదే సమయంలో, అభిమానుల ప్రేమకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపింది. ఈ వైరల్ వీడియోలో, తాను త్వరలో తెలుగు సినిమాలో నటిస్తున్నా అని తెలిపింది. డ్రాగన్ సినిమాతో విపరీతమైన పాపులర్ అయిన కయాదు లోహర్.. నాలుగేళ్ల క్రితమే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2021లో కన్నడలో ముగిల్పేటే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2022లో శ్రీవిష్ణుతో అల్లూరి సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.